బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. సూపర్ 30 సినిమాలో హృతిక్ సరసన నటించి అందరి మన్ననలు అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం జెర్సీ హిందీ రీమేక్ లో షాహిద్ సరసన నటిస్తోంది. ఇక ఇటీవల ఈ ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ట్రైలర్ మృణాల్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో మృణాల్ తన చిన్ననాటి చేదు జ్ఞాపకాలను నెమరువేసుకొంది.
“నేను చదువుకునే రోజుల్లో ట్రైన్ లో వెళ్లేదాన్ని.. రోజు ట్రైన్ లో కూర్చోవడానికి ప్లేస్ ఉండేది కాదు. డోర్ దగ్గర నిలబడాల్సి వచ్చేది. ఆ సమయంలో ఎంతో చిరాకు వచ్చేది. అలా నిలబడడం చాలా కష్టం. ఆ టైమ్ లో అక్కడి నుంచి దూకితే ఎలా ఉంటుంది..? చచ్చిపోతానా..? బతుకుతనా ..? అని ఆలోచించదాన్ని. ఇక స్టూడెంట్ లైఫ్ దాటుకొని నటిగా మారడానికి చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నో కష్టాల ఫలితంగా నేను ఇక్కడ నిలబడిగలిగాను” అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం మృణాల్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.