NTV Telugu Site icon

వామ‌ప‌క్ష తీవ్ర‌వాదంపై స‌మీక్షా స‌మావేశం…

కేంద్ర హొంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన వామ‌ప‌క్ష తీవ్ర‌వాదంపై స‌మీక్షా స‌మావేశం జరిగింది. అందులో న‌క్స‌లిజం 23శాతానికి , మ‌ర‌ణాల సంఖ్య 21శాతానికి త‌గ్గింది. న‌క్సల్ ప్ర‌భావిత ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం క‌ట్టుబ‌డి ఉంది. కేంద్ర‌, రాష్ట్రాల ఉమ్మ‌డి ప్ర‌య‌త్నాల‌తో న‌క్స‌లిజాన్ని అణిచివేయ‌డంలో స‌ఫ‌లం. ద‌శాబ్దాల పోరాటంలో తొలిసారిగా 200 కంటే త‌క్కువ మంది మరణించారు. వామ‌ప‌క్ష తీవ్ర‌వాద నిర్మూల‌న జ‌ర‌గ‌క‌పోతే దేశ సంపూర్ణ అభివృద్ధి సాధ్యం కాదు. కేంద్ర‌బ‌ల‌గాల కోసం రాష్ట్రాలు భ‌రించే ఖ‌ర్చును ప్ర‌ధాని త‌గ్గించారు. ఫ‌లితంగా 2900 కోట్ల రూపాయ‌ల ఖర్చు రాష్ట్రాలకు త‌గ్గిపోయింది అన్నారు.

ఇక ఆయుధాలు అప్ప‌గించి ప్ర‌జాస్వామ్య స్ర‌వంతిలోకి వ‌చ్చే మావోయుస్టులను ఆహ్వానిస్తూనే, అమాయ‌క జ‌నాన్ని, పోలీసుల‌ను చంపే వారికి అదే రీతిలో బుద్ధి చెప్తున్నాం. గ‌త ఆరు ద‌శాబ్దాల‌లో అభివృద్ధి లేమి కార‌ణంగానే వామ‌ప‌క్ష తీవ్ర‌వాదానికి బీజం ప‌డింది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ నేతృత్వంలో ప్ర‌స్తుతం వేగంగా అభివృద్ధి జరుగుతోంది. సామాన్య ప్ర‌జ‌ల అభివృద్ధికి అడ్డుప‌డ‌కూడ‌ద‌ని వామ‌ప‌క్ష తీవ్ర‌వాదులు సైతం భావిస్తున్నారు, అందుకే వేగంగా ప‌నులు జ‌రుగుతున్నాయి. వామ‌ప‌క్ష తీవ్ర‌వాదం వ‌ల్ల గ‌త 40 ఏళ్ల‌లో 16వేల మంది పౌరులు చ‌నిపోయారు.

ఈశాన్య ప్రాంతాల్లో తిరుగుబాటు బృందాలు సైతం లొంగిపోతున్నాయి అన్నారు. వామ‌ప‌క్ష తీవ్ర‌వాదం నిర్మూల‌న‌కు వారి ఆర్థిక వ‌న‌రుల‌ను అడ్డుకోవ‌డం అత్యంత ముఖ్యం. హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు 70శాతం త‌గ్గిపోయాయి, మృతుల సంఖ్య 82శాతానికి త‌గ్గింది. ప్ర‌స్తుతం 53 జిల్లాల‌లోనే మావోయిస్టుల ప్రాబ‌ల్యం ఉంది. వామ‌ప‌క్ష తీవ్ర‌వాదులకు ఆర్థిక వ‌న‌రులు అంద‌కుండా రాష్ట్రాలు ప‌ర‌స్స‌ర స‌హ‌కారంతో గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకోవాలి. త్వ‌ర‌లోనే వామ‌ప‌క్ష తీవ్ర‌వాదానికి చ‌ర‌మ‌గీతం పాడే అవ‌కాశం ఉంది అని పేర్కొన్నారు.