వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీ తరుపున అభ్యర్థులగా ఉండాలని చాలా మంది ధరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల విషయంలో అన్ని వర్గాలకు ప్రాధన్యం ఇవ్వాలని కమీటీ అభిప్రాయం పడింది. రేపు అభ్యర్థుల జాబితాను వెల్లండించేందుకు అన్ని సిధ్ధం చేసాం అని మంథని ఎమ్మెల్యే, కాంగ్రెస్ గ్రేటర్ వరంగల్ ఎన్నికల కో-కన్వీనర్ దుదీళ్ళ శ్రీధర్ బాబు తెలిపారు. కేసీఆర్ వరంగల్ లో రెండు రోజులు ఉండి,అప్పుడు ఎన్నికలలో చాలా హమీలు ఇచ్చాడు. 90 స్లామ్స్ గుర్తించారు…కానీ ఒక్కటి అభివృద్ధి చేయలేదు. ఒక్కరికైనా డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇచ్చాడా.. వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇచ్చారు…అందులో కొంతమందికీ ఇచ్చారు…కొంతమందికి ఇవ్వలే. వరంగల్ లో వరదలు వచ్చినప్పుడు అన్ని కాలనీలలో ప్రజలు ఆందోళన చెందారు. బీజేపీ ,టీఆర్ఎస్.. ఢిల్లీ లో రెండు పార్టీ లు దోస్తీ…గల్లిలో కుస్తీ చేస్తున్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో ప్రధాన నిర్ణయం కాజీపేట కొచ్ ఫ్యాక్టరీ లో టీఆర్ఎస్ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలే. వరంగల్ లో ఎన్నికలు వస్తున్నాయి గానుకు శంకుస్థాపనలు పెట్టుకున్నారు అని పేర్కొన్నారు.