Site icon NTV Telugu

Bigg Boss Telugu OTT : నాన్ స్టాప్ ఎంటర్టైనెంట్… లోగో అవుట్

Bigg-Boss-OTT

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే సందర్భంగా టీవీ షో OTT వెర్షన్ రెండు నెలల్లో ప్రత్యక్ష ప్రసారం కానుందని నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్టుగానే టీవీ షో కొత్త ఎడిషన్ గ్రాండ్ ప్రీమియర్ కోసం సిద్ధమవుతోంది. బిగ్ బాస్ తెలుగు పాపులర్ టెలివిజన్ ఎంటర్‌టైన్‌మెంట్ షోలలో ఒకటి. ఇప్పుడు షో OTT ప్రపంచంలోకి వస్తోంది. బిగ్ బాస్ తెలుగు OTT వెర్షన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుందని చాలా రోజులుగా వినిపిస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. డిస్నీ+ హాట్‌స్టార్ బిగ్ బాస్ ఆన్‌లైన్ వెర్షన్‌ స్ట్రీమింగ్ లోగోను షేర్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన అప్‌డేట్‌ను విడుదల చేసింది.

Read Also : Khiladi : హీరోయిన్ కు సారీ చెప్పిన డైరెక్టర్… ఏం జరిగిందంటే ?

“2022 అతిపెద్ద సర్ప్రైజ్ చివరకు ఇక్కడ ఉంది. #BiggBossNonStop 24/7 వినోదాన్ని అందిస్తుంది! బిగ్ బాస్ హౌస్ నుండి నేరుగా @DisneyPlusHSలో మాత్రమే. ఈ వినోద అద్భుతం అతి త్వరలో మీ చేతుల్లోకి రానుంది. తెలుగు ప్రేక్షకులను సరికొత్త స్థాయిలో అలరిస్తుంది!” అంటూ Disney+ Hotstar హ్యాండిల్ నుండి లోగోను షేర్ చేసింది. ఈ OTT షో కోసం ఇప్పటికే పోటీదారులు ఎంపికయ్యారు. బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ ఫిబ్రవరి 26 నుండి ప్రసారం కానుందని గాసిప్ విన్పిస్తోంది. టీవీ షోకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Exit mobile version