అన్ని ప్రముఖ అంతర్జాతీయ మీడియా ల్లో వచ్చిన కొత్తరకం వైరస్ పై చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచరిస్తే కేసు నమోదు చేయడం దారుణం అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈ విషయం పై ఫిర్యాదు చేసిన కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది సుబ్బయ్య కు జిల్లా మంత్రి జైరాం నిర్వహిస్తున్న పేకాట క్లబ్బులు కనబడలేదా??.. ఆ మంత్రి దోచుకున్న వేలాది ఎకరాల భూములు సుబ్బయ్య కు కనిపించలేదా?? అని ప్రశ్నించారు. తన సొంత జిల్లా మంత్రి అవినీతి పై మాట్లాడలేని సుబ్బయ్యకు చంద్రబాబు పై కేసు పెట్టే అర్హత లేదు అని చెప్పుకొచ్చారు. గత ఏడాది ఢిల్లీలో ముస్లిమ్స్ సమావేశం పెడితే నానా యాగీ చేసిన ప్రభుత్వాలు… కుంభమేళాకు అనుమతి ఎలా ఇచ్చారో సమాధానం చెప్పాలి అన్నారు. కరోనా వ్యాప్తికి ఇలాంటి కారణాలు సృష్టించిన వారిపై ఫిర్యాదు చేయని సుబ్బయ్య.. చంద్రబాబు పై కేసు పెట్టడం వెనక కారకులు ఎవరో తెలుసు. జగన్ తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఎన్ని కేసులు నమోదు చేసినా ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రజల పక్షాన నిలుచుని పోరాటం చేస్తూనే ఉంటాం అని పేర్కొన్నారు.