NTV Telugu Site icon

Telangana:19న ఆటో, క్యాబ్‌, లారీలు బంద్‌

???????? ?????? ?????????????

???????? ?????? ?????????????

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రోడ్డు భద్రతా చట్టాన్ని సాకుగా చూపించి ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ ఆలస్యమైతే రోజుకు రూ.50 జరిమానా విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న ఒక రోజు ఆటో, క్యాబ్‌, లారీల బంద్‌ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో, క్యాబ్‌, లారీ సంఘాల జేఏసీ వెల్లడించింది. ఈ మేరకు హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో బంద్‌కు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరించారు.

కౌంటర్ సిగ్నేచర్ పర్నిట్ ( సింగిల్ పర్మిట్ ) దేశంలోని ప్రతి రాష్ట్రం పొరుగు రాష్ట్రానికి ఇస్తున్నట్లుగా సంవ త్సరానికి రూ. 5, 000 తీసుకొని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరుకు రవాణా వాహనాలు వెళ్ళడానికి ఒప్పందం కుదుర్చుకోవాలని తెలంగాణ ఆటో క్యాబ్ లారీ మోటర్ సంఘాల జేఏసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేర‌కు స్థానిక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాలు నాయక్ కు వారు బంద్ నోటీసు ఇచ్చారు.

నేషనల్ పర్మిట్లకు సంబంధించి ఎదురవుతున్న సమస్య పరిష్కారం కోసం , చాలా కాలం నుండి తైబజార్ తహశీలు పంచాయతీ రుసుముల పేరుతో లారీ యజమానుల దగ్గర వసూలు చేయకూడదని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమీషనర్, అన్ని నగర మిన్సిపల్ శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్లకు లారీ యజమానుల వద్ద వసూలు చేయకూడదని తెలియజేయడం జరిగినదని తెలిపారు.

ఇప్పటివరకు ట్రేడర్స్ దగ్గర తీసుకోవలసిన డబ్బులు లారీ యజమాని డ్రైవర్ల వద్ద దౌర్జన్యం చేస్తూ వసూలు చేస్తున్నారని, ఈ విషయంపై తగు చర్యలు తీసుకోగలరని కోరారు. లోడింగ్, అన్ లోడింగ్ చాయ్ మామూళ్ల పేరుతో గుమస్తా మామూళ్లు ఏవైనా లారీ యజమానికి డ్రైవర్లకు సంబంధం లేకుండా చేస్తామని గతంలో సమ్మె చేసి సందర్భాలలో ప్రభుత్వ మంత్రులు, అధికారులు ఆనాటి గౌరవ రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అన్ని జిల్లాల కలెక్టర్లకు, కార్మిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు.

దురదృష్టవశాత్తు నేటికి అమలుకు నోచుకోవడం లేదని, దీంతో రవాణా రంగానికి ఈ సమస్య మోయలేని భారంగా తయారైందని పేర్కొన్నారు. ఇసుక అధిక లోడుతో పట్టుబడిన వాహనాలకు సంబంధించి పెనాల్టీలు కేసు రాసిన దగ్గరనే ఆన్లైన్లో కట్టించుకొని వదిలివేయాలని, అధికారులు క్వారీలోనే ఓవర్ లోడు నింపకుండా చర్యలు తీసుకోవాలని, ములుగు జిల్లా చిన్నబోయినపల్లి గ్రామం దగ్గర అక్రమంగా ఏర్పాటు చేసిన వేబ్రిడ్జి వాళ్ళు ప్రయివేటు వ్యక్తులతో ఇసుక లారీలను బెదిరించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోగలరని డిమాండ్ చేశారు.

కుప్పలు తెప్పలుగా ఈ చలాన్లు విధిస్తున్నారని సరుకు రవాణా వాహనాలకు చలాన్లపై సడలింపు ఇవ్వాలని తెలంగాణ లారీ అసోసియేషన్ బృందాన్ని గౌరవ ఐ. టి. మరియు మున్సిపల్ శాఖామాత్యులు కల్వకుంట్ల తారక రామారావుతో పాటు పోలీసు, రెవెన్యూ, రవాణ శాఖ, వ్యవసాయ, సివిల్ సప్లై, మున్సిపల్ , పంచాయతీరాజ్ , కార్మిక మరియు మైనింగ్ అధికారులతో అధికారులతో సమావేశం ఏర్పాటు చేయించి అట్టి సమావేశంలో మా యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తమరిని వేడుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు ఎన్ రాజు శ్రీను నాయక్, షాద్‌నగర్ లారీ అసోసియేషన్ నాయకులు సయ్యద్ సాదిక్, మొహమ్మద్ నవాజ్ గోరీ, మహమ్మద్, శేఖర్రెడ్డి, తిరుపతి రెడ్డి, ఆటో యూనియన్ నాయకులు ధన్ రాజ్, మురళి, వెంకటేష్, చందు, తదితరులు పాల్గొన్నారు.

Somireddy: వ్యవసాయ మోటార్లకు మీటర్లు.. సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు