ఉత్తర దక్షిణ ద్రోణి ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి మధ్యప్రదేశ్ మరియు పొరుగు ప్రాంతాల మీదుగా ఉన్న తుఫాను ప్రసరణ నుండి మరాట్వాడా, దక్షిణ మధ్య మహారాష్ట్ర మరియు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా కర్ణాటక తీరం వరకు నడుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధానంగా తక్కువ ఎత్తులో దక్షిణ / ఆగ్నేయ గాలులు వీస్తూన్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
ఈ రోజు ఉరుములు , మెరుపులు తో పాటు ఒకటి లేదా రెండు చోట్ల చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (30 నుండి 40 కి మీh వేగంతో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు , మెరుపులు తో పాటు ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈరోజుపు, రేపు మరియు ఎల్లుండి ఉరుములు , మెరుపులు తో పాటు ఒకటి లేదా రెండు చోట్ల, తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
ఈరోజు, రేపు మరియు ఎల్లుండి ఉరుములు , మెరుపులు తో పాటు ఒకటి లేదా రెండు చోట్ల, తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.