NTV Telugu Site icon

Andhrapradesh: కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం

New Sps

New Sps

శుభకృత్ నామ ఉగాది సందర్భంగా సరికొత్త ఆశలతో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకు అనుగుణంగా కొత్త గెజిట్ రూపొందించింది. కొత్త జిల్లాల పాలనకు అనుగుణంగా కలెక్టర్లు, ఎస్పీలను నియమించింది.

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు కలెక్టర్ల నియామకం జరిగింది. సత్యసాయి జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమార్, అనంతపురం జిల్లా కలెక్టర్‌ గా నాగలక్ష్మి, విశాఖ జిల్లా కలెక్టర్ గా మల్లికార్జున, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా బాలాజీ రావుని నియమించారు. విజయనగరం జిల్లా కలెక్టర్‌ గా సూర్యకుమారి, మన్యం జిల్లా కలెక్టర్ గా నిశాంత్ కుమార్, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా సుమిత్ కుమార్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ గా రవి సుభాష్ ని నియమించారు,

కాకినాడ జిల్లా కలెక్టర్ గా కృత్తికా శుక్ల, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా మాధవిలత, కోనసీమ జిల్లా కలెక్టర్‌ గా హిమాన్షు శుక్లా, పశ్చిమగోదావరి కలెక్టర్‌ గా పి. ప్రశాంతి, ఏలూరు జిల్లా కలెక్టర్ గా ప్రసన్న వెంకటేష్, కృష్ణా జిల్లా కలెక్టర్ గా రంజిత్ బాషా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా ఢిల్లీ రావు, కడప జిల్లా కలెక్టర్‌ గా విజయరామరాజు, గుంటూరు జిల్లా కలెక్టర్ గా వేణుగోపాల్ రెడ్డి, పల్నాడు జిల్లా కలెక్టర్ గా శివ శంకర్, బాపట్ల జిల్లా కలెక్టర్‌గా విజయను నియమించారు.

ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, నెల్లూరు జిల్లా కలెక్టర్గా చక్రధర బాబు, బాలాజీ జిల్లా కలెక్టర్‌ గా వెంకటరమణారెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌ గా హరినారాయణ, అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా గిరీష, కర్నూలు జిల్లా కలెక్టర్‌గా కోటేశ్వరరావుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది. అలాగే, రాష్ట్రంలో 26 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది ప్రభుత్వం. విశాఖ కమిషనర్‌గా సీహెచ్‌. శ్రీకాంత్ నియామకం జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా జి.ఆర్‌.రాధిక, విజయనగరం జిల్లా ఎస్పీగా ఎం.దీపిక కొనసాగింపు చేయాలని నిర్ణయించింది. అలాగే, పార్వతీపురం ఎస్పీగా వాసన విద్యా సాగర్‌ నాయుడు, అనకాపల్లి ఎస్పీగా గౌతమి సాలి, అల్లూరి సీతారామరాజు ఎస్పీగా సతీశ్‌కుమార్ లను నియమించారు. కాకినాడ ఎస్పీగా రవీంద్రనాథ్‌బాబుని నియమించారు.

కోనసీమ జిల్లా ఎస్పీగా కె.ఎస్‌.ఎస్‌.వి. సుబ్బారెడ్డిని నియమించారు. తూ.గో. జిల్లా ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, ప.గో. జిల్లాగా ఎస్పీగా రవిప్రకాశ్, ఏలూరు జిల్లా ఎస్పీగా ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డిని నియమించారు. కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ని కొనసాగించనున్నారు. విజయవాడ కమిషనర్‌గా క్రాంతి రాణా టాటా కొనసాగుతారు. గుంటూరు ఆర్బన్‌ ఎస్పీగా కె.ఆరీఫ్‌ హాఫీజ్‌ ని కొనసాగిస్తారు. పల్నాడు జిల్లా యస్ పి గా రవిశంకర్ రెడ్డి, బాపట్ల జిల్లా యస్ పి గా వకుల్ జిందాల్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.