ఎన్నికలు సమీపిస్తున్న పంజాబ్ కాంగ్రెస్‌లో విభేదాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై నలుగురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలిని సరిగా లేదని… అయన్ను వెంటనే మార్చాల్సిందేనని సిద్ధూ వర్గం నేతలు పట్టుబట్టారు. అవసరం అయితే, సోనియా గాంధీని కలుస్తామని ప్రకటించారు. ఇంతలోనే పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకులు హరీష్‌రావత్… అసంతృప్తవర్గానికి చెందిన నలుగురు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.
నలుగురు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు… రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి వివరించారని హరీష్ రావత్ తెలిపారు. తిరుగుబావుట ఎగురవేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వ్యతిరేకంగా కాదని చెప్పారు. పటిష్టమైన ప్రణాళికతోనే ఎన్నికలకు వెళ్లాలన్నదే…సిద్ధూ వర్గం నేతల ఆకాంక్ష అని వెల్లడించారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని హరీశ్ రావత్ ప్రకటించారు. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లనున్నట్లు హరీశ్ రావత్ ప్రకటించడంతో…అసంతృప్తి మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తారన్న దానిపై ఆసక్తిగా మారింది.