NTV Telugu Site icon

WhatsApp : ఇక నుంచి ఆ ఐఫోన్లలో వాట్సాప్ బంద్‌..

Whatsapp

Whatsapp

వినినియోదారులకు మరించి చేరువయ్యేందుకు వాట్సాప్‌ కొత్త కొత్ ఫీచర్లను తీసువస్తూనే ఉంది. అదే సమయంలో వినియోగుదారులకు సంబంధించిన డేటాను భద్రపరచడంలో కూడా అత్యంత ప్రాధాన్యత తీసుకుంటుంది మెటా. అయితే మెటాలో భాగమైన వాట్సాప్‌ కొన్ని నెలల్లో ఆ ఐఫోన్లలో పనిచేయదని మెటా తెలిపింది. యాపిల్ ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 సాఫ్ట్‌వేర్‌లపై పనిచేయస్తున్న పాత ఐఫోన్లకు వాట్సాప్‌ సపోర్ట్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అంటే ఐఫోన్లలో వాట్సాప్ వాడాలంటే ఇక నుంచి కనీసం ఐవోఎస్ 12 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉండాల్సిందే.

Whatsapp Iphone

రానున్న నెలల్లో ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 అప్‌డేట్లకు వాట్సాప్ సపోర్ట్ అందించడం నిలిపివేయనుంది. 2022 అక్టోబర్ 24వ తేదీ నుంచి ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు తమ ఐఫోన్లలో వాట్సాప్ వాడాలంటే ఈ ఆపరేటింగ్ సిస్టంకు అప్‌గ్రేడ్ చేసుకోక తప్పదు. అయితే ప్రస్తుతం ఐవోఎస్ 10, 11ల మీద పనిచేసే ఫోన్ల సంఖ్య తక్కువగానే ఉంది. ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ స్మార్ట్ ఫోన్లు మాత్రమే ఈ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తున్నాయి.