మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా బయట పెట్టిన షాకింగ్ బ్యూటీ సీక్రెట్ చర్చనీయాంశంగా మారింది. గత దశాబ్ద కాలంగా సౌత్ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీకి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికి చెక్కు చెదరని తన అందంతో అప్ కమింగ్ హీరోయిన్లకు పోటీనిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు మాస్ట్రో చిత్రంతో పాటు ఎఫ్3 చిత్రంలో నటిస్తోంది. ఇటీవల డిస్నీ + హాట్‌స్టార్ సిరీస్ “నవంబర్ స్టోరీ”లో కనిపించిన తమన్నా… తెలుగులో ఓ వంట కార్యక్రమానికి హోస్ట్‌గా ఆమె టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. తాజాగా తమన్నా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ గ్లామర్ సీక్రెట్ చెప్పేసి అందరికీ షాకిచ్చింది.
Also Read : అప్పుడే ట్రెండ్ సృష్టిస్తున్న మహేష్ ఫ్యాన్స్…!
ఈ ఇంటర్వ్యూలో మీ అందం వెనుక రహస్యం ఏమిటని ప్రశ్నించగా… లాలాజలం అని ఏమాత్రం తడుముకోకుండా చెప్పేసింది. ముఖంపై మొటిమలు రాకుండా ఉండడానికి లాలాజలం బాగా ఉపయోగపడుతుందట. ఉదయం లేవగానే తన లాలాజాలం (సలైవా)ను ముఖానికి అప్లై చేస్తానని చెప్పింది ఈ మిల్కీ బ్యూటీ. సలైవా స్కిన్ ప్రాబ్లమ్స్ ను బాగా క్లియర్ చేస్తుందని క్రేజీ ఆన్సర్ ఇచ్చింది తమన్నా.