Site icon NTV Telugu

ప్రకృతికి దగ్గరగా ప్రభాస్… సన్‌రూఫ్ వానిటీ వాన్

Sunroof in Prabhas new van

టాలీవుడ్ స్టార్స్ తమ వానిటీ వ్యాన్‌లపై భారీగా ఖర్చు చేస్తారు. అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ లకు లగ్జరీ వానిటీ వ్యాన్‌ లు ఉన్నాయన్న విషయం తెలిసిందే. దానికోసం వాళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఇక అల్లు అర్జున్ ‘ఫాల్కన్’ అయితే అందరి దృష్టిని ఆకర్షించింది. హీరోలు వాడే ఈ వ్యానిటి వ్యాన్ లలో అన్ని సదుపాయాలూ ఉంటాయి. ఇందులో వారు ఎక్కడికైనా వెళ్లొచ్చు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఇటీవల ఒక లగ్జరీ వ్యాన్ కొనుగోలు చేశారు. నిజానికి ప్రభాస్ దానిని చాలా కాలం క్రితం కొనుగోలు చేసాడు. కానీ రీసెంట్ గా దానిని అన్ని కొత్త ఫీచర్లతో పునర్నిర్మించాడు. ముఖ్యంగా ఈ వాన్‌లో సన్‌రూఫ్ ఫీచర్ అమర్చారు.

Read Also : ఇండోనేషియా లాంగ్వేజ్ లో రీమేక్ అవుతున్న ఫస్ట్ మూవీ

ప్రభాస్ అవుట్ డోర్ లొకేషన్స్ షూట్ చేస్తున్నప్పుడు తన వానిటీ వ్యాన్ లో సహజ లైటింగ్ ఉండడానికి ఇష్టపడతాడట. అందుకే ఈ ఫీచర్ ను ప్రత్యేకంగా అమర్చుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “ఆదిపురుష్”. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ వాన్‌లో సన్‌రూఫ్ ఫీచర్ ను ఫోటో తీసి పోస్ట్ చేస్తూ “పనిలో ఉన్నప్పుడు కూడా ప్రకృతికి దగ్గరగా… సూపర్” అంటూ ప్రభాస్‌ని ప్రశంసించాడు.

Exit mobile version