Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Safety Tips: వర్షాకాలం, వేసవి కాలం వస్తే చాలు.. ఇళ్లలోకి పాములు వచ్చాయనే వార్తలు తరచూ వింటూనే ఉంటాం. సాధారణంగా చీకటి, చల్లని ప్రదేశాలను వెతుక్కుంటూనే పాములు ఇళ్లలోకి వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ, అది మాత్రమే నిజం కాదు. మనం అసలు ఊహించని కొన్ని ప్రత్యేకమైన వాసనలు కూడా పాములను మన ఇంట్లోకి ఆకర్షిస్తాయని మీకు తెలుసా?
పాములకు చూపు కంటే ఘ్రాణశక్తి (వాసన చూసే శక్తి) చాలా ఎక్కువ. అవి తమ నాలుక సహాయంతో గాలిలోని వాసనలను పసిగట్టి, ఆహారం ఉన్న చోటికి లేదా తమకు ఇష్టమైన ప్రదేశాలకు చాలా సులువుగా చేరుకుంటాయి. ముఖ్యంగా మన ఇంట్లో ఉండే ఎలుకలు, బల్లులు, కప్పలు వంటివి పాములకు అత్యంత ఇష్టమైన ఆహారం. ఇళ్లలో ఎలుకలు తిరగడం వల్ల వచ్చే వాసన, వాటి మలమూత్రాల వాసనను పాములు చాలా వేగంగా పసిగడతాయి. అలాగే ఇంట్లో పెరటి కోళ్లు, పెంపుడు పక్షులు, కుందేళ్లు ఉన్నప్పుడు.. వాటి వ్యర్థాలు, ఈకలు, ఆహారం నుంచి ఒక ప్రత్యేకమైన వాసన వస్తుంది. పక్షుల గూళ్లలోని గ్రుడ్ల వాసనను పసిగట్టి కూడా పాములు గోడలు, కప్పుల ద్వారా ఇంట్లోకి దూరిపోతాయి. వీటితో పాటు తోటలో లేదా ఇంటి మూలల్లో కుళ్ళిపోతున్న తడి ఆకులు, చెత్తాచెదారం, చెక్క దిమ్మెలు, ఇళ్లలోని సీలన్ (తేమ) వాసనలు పాములకు సురక్షితమైన తావుగా అనిపిస్తాయి. ఈ వాసనలన్నీ మనం తెలియకుండానే పాములకు ఆహ్వానం పలికినట్లవుతాయి.
Also Read
- Maharashtra: "ఇది కదా విశ్వాసం అంటే".. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
- Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
- 64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
- Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే 'క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్' సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మొదటగా ఇంట్లో ఎలుకలు, బల్లులు పెరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలి, దీనివల్ల పాములకు ఆహారంతో పాటు ఆ వాసన కూడా దొరకదు. ఇంటి బాత్రూమ్లు, బేస్మెంట్లు, మూలల్లో తేమ లేకుండా పొడిగా ఉంచుకోవాలి. ఇంటి మురుగునీటి కాలువలు, ప్రధాన ద్వారాలు, గార్డెన్ పరిసరాల్లో ఫినాయిల్ లేదా కిరోసిన్ చల్లడం వల్ల, ఆ ఘాటైన వాసనకు పాములు దరిదాపుల్లోకి రావు. అలాగే ఇంటి చుట్టూ ఎండుటాకులు, కలప పోగులు పడనీయకుండా శుభ్రంగా ఉంచుకుంటూ, గార్డెన్లోని గడ్డిని ఎప్పటికప్పుడు చిన్నగా కత్తిరిస్తే పాములు దాక్కోవడానికి స్థలం ఉండదు.
తాజావార్తలు
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Japan Earthquake: జపాన్లో 5.9 తీవ్రతతో భూకంపం.. 20 మందికి గాయాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
-
Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!