Site icon NTV Telugu

డేనియల్ శేఖర్ భార్య నేనే… క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Samyuktha Menon is Rana Daggubati wife

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాలో రానా భార్య పాత్రలో కనిపించాల్సిన ఐశ్వర్య రాజేష్ సినిమా నుంచి తప్పుకుందని, ఆమె పాత్రలో వేరే హీరోయిన్ నటిస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నారు. ఐశ్వర్య పాత్రను మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ రీప్లేస్ చేసిందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయాన్నీ సంయుక్త అధికారికంగా ప్రకటించేసింది. ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసిన ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

Read Also : ‘ఛీటర్స్’ అంటూ సిద్ధార్థ్ ట్వీట్… ఆ సెటైర్ ఎవరిపై ?

“భీమ్లా నాయక్ సినిమాలో రానా దగ్గుబాటితో జత కట్టి, లీడర్, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సర్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో అందమైన డెబ్యూ. ఈ సంక్రాంతి ఘనంగా జరగబోతోంది” అంటూ పోస్ట్ చేసింది. “భీమ్లా నాయక్‌”లో రానా దగ్గుబాటి భార్యగా సంయుక్త మీనన్ నటించబోతున్నందున సినీ ప్రేమికులు, రానా దగ్గుబాటి అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ‘భీమ్లా నాయక్’ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

Exit mobile version