రితికా సింగ్ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగు సీనియర్ హీరో వెంకటేష్ నటించిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది.. ఇక ఇప్పుడు ఏకంగా రజినీకాంత్ సినిమాలోనే నటిస్తుంది.. జైలర్ తర్వాత రజినీ ప్రస్తుతం టీఎస్. జ్ఞానవేల్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాను లైకా బ్యానర్ పై నిర్మిస్తుండగా.. తలైవా 170 అనే వర్కింగ్ టైటిల్ తో ఈమూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కొద్ది రోజుల క్రితమే రితిక ఈ చిత్రీకరణలో పాల్గొంటుంది.
అయితే మంగళవారం షూటింగ్ సెట్లో జరిగిన ప్రమాదంలో హీరోయిన్ రితిక గాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్ స్టా స్టోరీలో ఓ ఫోటో షేర్ చేసింది రితిక.. ఓ జంతువుతో పోరాడినట్లు తెలుస్తుంది.. జాగ్రత్తగా ఉండాలని అందరూ హెచ్చరించారు. కానీ నేను గాయపడ్డాను. అందుకు చాలా బాధగా ఉంది. కొన్నిసార్లు వేగాన్ని నియంత్రించడం కష్టం. నా నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదం జరిగింది. కానీ ఇప్పుడు నొప్పి లేదు.. గాయం బాగానే తగిలింది.. ప్రస్తుతం బాగానే ఉన్నాను అని పోస్ట్ లో పేర్కొంది..
దర్శకుడు టీఎస్.జ్ఞానవేల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. సుధీర్ఘ విరామం తర్వాత అమితాబ్, రజినీ కలిసి నటిస్తున్నారు. ఇందులో భగత్ బాసిల్, రానా , మంజు వారియర్, దుషార విజయన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈను రూపొందిస్తున్నారు.ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.. ప్రస్తుతం రితికా సింగ్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది..