NTV Telugu Site icon

Jailer: బ్లాక్ బస్టర్ జైలర్.. రజనీకి అదిరే గిఫ్ట్.. కార్ల షోరూమే ఇంటికొచ్చేసింది!

Jailer Bmw

Jailer Bmw

Rajinikanth gets BMW car from ‘Jailer’ producer as gift: ఇటీవల విడుదలైన జైలర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ కు సన్ పిక్చర్స్ యజమాని కళానిధి మారన్ బీఎండబ్ల్యూ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. ఆగస్టు 10న రిలీజైన రజనీకాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ జైలర్ సినిమా రూ.600 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం తమిళంలోనే కాదు తెలుగులో సైతం జైలర్ సినిమా భారీ హిట్‌గా నిలిచింది, ఈ విజయాన్ని రజనీకాంత్ అభిమానులు మాత్రమే కాదు సినీ అభిమానులు సైతం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంలో జైలర్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వ్యవస్థాపకుడు కళానిధి మారన్ స్వయంగా నటుడు రజనీకాంత్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జైలర్ సినిమాకు గాను ఇప్పటికే రజనీకాంత్ కి రెమ్యునరేషన్ ఇవ్వగా ఇప్పుడు సినిమా లాభాల్లో వాటా కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కళానిధి మారన్ నిన్న రజనీకాంత్‌కి చెక్ ఇస్తున్న ఫొటో సైతం వైరల్ అవుతోంది.

Kushi Review: ఖుషి రివ్యూ

ఇక ఇదే క్రమలో జైలర్ భారీ విజయం సాధించిన సందర్భంగా నిర్మాత కళానిధి మారన్ రజనీకాంత్‌కు రూ.1.24 కోట్ల విలువైన లగ్జరీ బిఎమ్‌డబ్ల్యూ x7 కారును బహుమతిగా ఇచ్చారు. 1.24 కోట్ల విలువైన బిఎమ్‌డబ్ల్యూ x7 అలాగే బిఎమ్‌డబ్ల్యూ ఐ7 అనే రెండు లగ్జరీ కార్లలో ఎదో ఒకటి ఎంచుకోవాలని కళానిధి మారన్ రజనీని కోరారు. ఈ మేరకు ఇంటికే కార్లు కూడా తీసుకు రాగా ఆ సమయంలో రజనీకాంత్ BMW x7ని ఎంచుకున్నారు. ఇక జైలర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.600 కోట్ల కలెక్షన్లు దాటేసి మరింత ముందుకు వెళ్తున్నాయి. ఇక ఇంతకుముందు జైలర్ 525 కోట్లు వసూలు చేసిందని సన్ పిచర్స్ అధికారికంగా వెల్లడించింది. ఒక్క తమిళనాడులోనే ఇప్పటివరకు రూ. 328 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాక్సాఫీస్ డేటా షేరింగ్ ప్లాట్‌ఫాం ఒకటి రిపోర్ట్ చేసింది. రజనీకాంత్ 2.0 తమిళంలో అత్యధికంగా రూ.615 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించగా, జైలర్ దానిని అధిగమిస్తుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.