Site icon NTV Telugu

Pudding and Mink Drugs case: డ్రగ్స్ కేస్ FIRలో కీలకాంశాలు

Banjara Ps

Banjara Ps

హైదరాబాద్ లో సంచలనం కలిగించిన పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసు ఎఫ్ ఐ ఆర్ లో మొత్తం నలుగురు నిందితులు చేర్చారు బంజారాహిల్స్ పోలీసులు.నిందితులుగా అనిల్, అభిషేక్ , కిరణ్ రాజ్, అర్జున్. పరారీలో అర్జున్, కిరణ్ రాజ్ ల కోసం గాలిస్తున్న పోలీసులు. ఇప్పటికే అరెస్ట్ అయిన అనిల్, అభిషేక్ లను రిమాండ్ కు తరలించనున్నారు పోలీసులు.

డ్రగ్స్ కేస్ FIRలో కీలకాంశాలు వున్నాయని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. శనివారం అర్ధ రాత్రి దాటిన తరువాత 1:40 కు పబ్ కు సంబంధించిన సమాచారం వచ్చింది. రాడిసన్ బ్లు హోటల్ లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో తెల్లవారుజామున 4 గంటలకు కోకైన్ సరఫరా చేస్తున్నారని సమాచారం వచ్చింది. ఈజీ మనీ కోసమే డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు నిర్వాహకులు.

విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఉన్నత అధికారులకు సమాచారం చేరవేశారు సిబ్బంది. 1985 NDPS యాక్ట్ u/s 42(2) కింద కేస్ నమోదు చేశారు. క్లూస్ టీమ్ కు సమాచారం అందించారు పోలీసులు. పబ్ పై 2 గంటల ప్రాంతంలో లో దాడి చేశారు. దాడి చేసే ముందు తమ వెంట ల్యాప్ టాప్,మిని ప్రింటర్ , వెయింగ్ మెషిన్, ప్యాకింగ్ మెటీరియల్ వెంట తీసుకెళ్ళారు పోలీసులు. పబ్ లో కి ఎంటర్ కాగానే మేనేజర్ అనిల్ కుమార్ ను కలిసి దాడి సమాచారం ఇచ్చాం అని ఎఫ్ ఐ ఆర్ లో పోలీసులు తెలిపారు.

క్లూస్ టీమ్ తో కలిసి పబ్ పై దాడి చేశాం. పబ్ లో అనిల్ , ప్రవీణ్ లను మధ్యవర్తులు పెట్టుకుని వారి సమక్షం లో దాడులు చేశాం. మేనేజర్ అనిల్ కుమార్ వద్ద ప్లాస్టిక్ ట్రే లో కొకైన్ కు స్వాధీనం చేసుకున్నాం. మొత్తం 5 ప్యాకెట్లు లలో 4.64 గ్రాములు తెల్ల పౌడర్ స్వాధీనం. పబ్ లోనే ఉన్న పార్టనర్ అభిషేక్ ను అదుపులోకి తీసుకున్నాం. అభిషేక్ మొబైల్ స్వాధీనం చేసుకున్నామని ఎఫ్ఐఆర్ లో తెలిపారు.

Fir Copy

ఎఫ్ ఐ ఆర్ వివరాలు:

క్రైమ్ నంబర్ 226/2022 u/S 8(c), 22(b),29(1) of NDPS చట్టం 1985 కేసు నమోదు.

నిందితులు వివరాలు:
A1)మహదరం అనిల్ కుమార్

A 2)అభిషేక్ వుప్పాల

A 3)అర్జున్ వీరమాచినేని

A4)కిరణ్ రాజు

స్వాధీనం చేసుకున్న మెటీరియల్:

S-1 బరువు 1 గ్రాము, S-2 బరువు 0.64 గ్రాములు, S-3 బరువు 0.93 గ్రాములు, S-4 1 గ్రాము మరియు S-5 బరువు 1.07 గ్రాములు
(మొత్తం – 4.64 గ్రాములు) స్వాధీనం

బార్ కౌంటర్ నుండి స్ట్రాస్, టిష్యూ పేపర్లు, టూత్ పిక్స్‌తో పాటు రెండు కేడీ (ప్లాస్టిక్ ట్రే) స్వాధీనం

216సిగిరెట్ పీకలు సైతం స్వాధీనం

DI Samsung Galaxy S22, మరియు Apple iPad 5
మోడల్ ఫోన్ స్వాధీనం

ల్యాప్‌టాప్, మినీ-ప్రింటర్, వెయింగ్ మెషీన్ మరియు ప్యాకింగ్ మెటీరియల్‌తో రాడిసన్ బ్లూ హోటల్ 1వ అంతస్తులో లోని పబ్ లో స్వాధీనం

 

Exit mobile version