సోషల్ మీడియా వచ్చాక ఫ్యాన్స్ కి, వారి ఫేవరెట్స్ కి మధ్య దూరం పూర్తిగా తొలగిపోయింది. అందుకే, తన తాజా వీడియోలో ప్రియాంక చోప్రా ‘నేను బ్యాడ్ గాళ్ నా? లేక గుడ్ గాళ్ నా?’ అంటూ సరదాగా ప్రశ్నించింది! అఫ్ కోర్స్, ఇన్ స్టాగ్రామ్ లో ఆమె డై హార్డ్ ఫాలోయర్స్ ‘గుడ్ గాళ్’ అనే అన్నారు. కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పీసీ తాను నేరుగా జనం ముందుకు రాలేదు. ఓ డిస్నీ క్యారెక్టర్ రూపంలో నెటిజన్స్ ఆశ్చర్యపరిచింది… ఈ మధ్య నెటిజన్స్ కు రకరకాల ఫిల్టర్స్ అందుబాటులోకి వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రియాంక కూడా అటువంటి ఫిల్టర్ ఒకటి వాడి ఇన్ స్టాలో ఇన్ స్టాంట్ గా కార్టూన్ అయిపోయింది! డాల్ ఐస్, రోజీ చీక్స్, పౌటెడ్ లిప్స్ తో చూసేవార్ని మెస్మరైజ్ చేసింది. అయితే, బొమ్మగా మారిన దేసీ భామ ”యూ థింక్ ఐ యామ్ ఏ బ్యాడ్ గాళ్? ఆర్ ఏ గుడ్ గాళ్?” అంటూ కవ్వించింది! ప్రియాంక ఫిల్టర్డ్ వీడియోకి నెటిజన్స్ కు ఉత్సాహంగా స్పందించారు. క్షణాల్లో సొషల్ మీడియాలో వైరల్ చేశారు!
Read Also : ప్రొడ్యూసర్ గా ‘ట్రిపుల్ ఆర్’ బ్యూటీ! షారుక్ తో చెట్టపట్టాల్!!
ఆన్ లైన్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మిసెస్ జోనాస్ ఫాదర్స్ డే సందర్భంగా తన లేట్ ఫాదర్ అశోక్ చోప్రాను స్మరించుకుంటూ పోస్ట్ పెట్టింది. అందులోనే పాల్ కెవిన్ జోనాస్ సీనియర్ ని కూడా ట్యాగ్ చేస్తూ ‘ఫాదర్స్ డే’ విషెస్ చెప్పింది! ఆయన నిక్ జోనాస్ తండ్రి… ప్రియాంక ప్రస్తుతం లండన్ లో ఓ సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. స్పై థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఆ సినిమాలో నటుడు రిచర్డ్ తో రొమాన్స్ చేయనుంది.