NTV Telugu Site icon

Viral Video: హనుమాన్ చాలీసా విని కడుపులో ఉన్న బిడ్డ ఏం చేశాడో చూడండి (వీడియో)

Viral News

Viral News

స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు మంచి సాహిత్యం చదవాలని, మంచి పాటలు వినాలని, ఆధ్యాత్మికతపై ఏకాగ్రత పెట్టాలని పెద్దలు చెప్పడం మీరు తరచుగా వినే ఉంటారు. ఎందుకంటే కడుపులోని పిల్లలు అవన్నీ విని అర్థం చేసుకుంటారని నమ్మకం. పిల్లలు సంగీతానికి ప్రతిస్పందిస్తారని వైద్యులు కూడా అంగీకరించారు. ప్రజలు కూడా భజనలు, భక్తి పాటలు మొదలైనవాటిని వినమని సలహా ఇస్తారు.

READ MORE: Saif Ali Khan: సైఫ్‌పై దాడి “అంతర్జాతీయ కుట్ర” అనుమానం.. 5 రోజుల కస్టడీ విధించిన కోర్ట్….

ఇలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ గర్భిణీ స్త్రీ హనుమాన్ చాలీసాను తన కడుపులో ఉన్న బిడ్డకు వినిపించడంతో బిడ్డ రియాక్ట్ అవుతోంది. మొదట ఆమె ఓ సినిమా పాటను ప్లే చేస్తుంది. ఆ పాటకు బిడ్డ ఎలాంటి రియాక్షన్ ఇవ్వదు. తర్వాత ఆమె హనుమాన్ చాలీసాను ప్లే చేస్తుంది. అప్పుడు ఆ బిడ్డ కదులుతున్నట్లు వీడియోలో చూడవచ్చు.

READ MORE:Bollywood : 25 ఏళ్ల తర్వాత జోడీ కడుతున్న హిట్ పెయిర్

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారు @SunRaahలో పోస్టు చేశారు. ఆ మహిళ తన బిడ్డ హనుమాన్ చాలీసాకు ఎలా స్పందిస్తుందో కెమెరాలో చూపిస్తున్న వీడియోను పోస్ట్ చేయడంతో కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికే కోటికి పైగా వీక్షణలను పొందింది. అయితే చాలా మంది తమ అభిప్రాయాన్ని కామెంట్ చేశారు. ఓ వ్యక్తి “బాబు లోపల అంతా వింటున్నాడు! హనుమంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.” అని కామెంట్ చేశాడు. ఆ వీడియోపై చాలా మంది జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.