NTV Telugu Site icon

Pawan kalyan : పవన్ కళ్యాణ్ ‘బ్రో ‘ఈవెంట్ లో పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎన్ని లక్షలో తెలుసా?

Pawan Kalan Viral News

Pawan Kalan Viral News

సెలెబ్రేటీలు పెట్టుకొనే వస్తువులు అన్నీ చాలా ఖరీదైనవి.. బ్రాండెడ్ వస్తువులే ఎక్కువగా ఉంటాయి.. వాటిని ధరించి జనాల్లోకి వచ్చినప్పుడు వాటి ఖరీదు, ప్రత్యేకతలు తెలుసుకొని ఫ్యాన్స్ షాక్ అవ్వడం తో పాటు తమ హీరో, హీరోయిన్ రేంజ్ అది అంటూ తెగ సంబరపడి పోతారు.. ఈక్రమంలో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.. అంతేకాదు ట్రెండింగ్ లో ఉంది..

Read Also:Hamsa Nandini : హాట్ అందాలతో హీటేక్కిస్తున్న హంస నందిని..

తాజాగా బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగాజరిగింది. ఈ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్లో పెట్టుకున్న వాచ్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది. ఆ వాచ్ రేటు తెలిసి పిచ్చొళ్ళు అవుతున్నారు మెగా ప్యాన్స్. ఇంతకీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వాచీ ధర ఎంతో తెలుసా అంటూ అంటూ తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది…
Read Also:Pic Talk: అజిత్ న్యూ లుక్ అదిరిపోయిందిగా.. క్యా సింప్లిసిటి బాసూ..

ఈవెంట్ లో పవన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.. సింపుల్ గా కనిపించి అందరిని ఆకట్టుకున్నారు.. ఖరీదైన వాచ్ పెట్టుకొని అందరిని ఆశ్చర్య పరిచారు.. పవన్ కళ్యాణ్ బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేతికి పెట్టుకున్న వాచ్ బ్రెగ్యుట్ మెరైన్ కొనోగ్రాఫ్ వాచ్. దీని ధర అక్షరాల 21 లక్షల 45 వేల చిల్లర అని సమాచారం. ఈ వాచ్ గురించి నెట్టింటలో సెర్చ్ చేసిన అభిమానులు వాచ్ కాస్ట్ తో పాటు.. పవర్ స్టార్ రేంజ్ ను కూడా సోషల్ మీడియాలో హైలెట్ చేస్తున్నారు. వాచీ ఖరీదు తెలిసి చాలామంది షాక్ అవుతున్నారు.. మొత్తానికి ఈ వాచ్ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.. ఇక బ్రో సినిమా రేపు ప్రేక్షకులకు ముందుకు రానుంది.. ఆ తర్వాత మరో సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు పవన్.. అదే విధంగా ఎలెక్షన్స్ దగ్గర పడటంతో ప్రచారాలు కూడా చేస్తున్నారు..