టాలీవుడ్ ఐటమ్ బాంబ్ గా పేరుతెచ్చుకున్న హాట్ బ్యూటీ హంస నందిని.. తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న మిర్చి, అత్తారింటికి దారేది, శౌర్యం లాంటి ఎన్నో సినిమాల్లో తన బ్యూటీతో ఆకట్టుకుంది. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా… ఆమె అందంతో అందరిని మెస్మరైజ్ చేసింది హంసా నందిని.. ఐటమ్ సాంగ్స్ లో కనిపించి అదరగొట్టిన హంసా నందిని బ్రెస్ట్ కేన్సర్ బారిన పడడం అందరికి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో క్యాన్సర్ బారిన పడినట్టు ప్రకటించిన ఆమె.. చాలా బాధను అనుభవించింది. అప్పటి నుంచీ ట్రీట్మెంట్ తీసుకుంటూ.. చివరకు క్యాన్సర్ ను జయించిందని తెలిపింది..
హంస నందిని తల్లి కూడా క్యాన్సర్ తోనే మరణించింది. ఈ విషయాన్ని కూడా గుర్తు చేసుకుుంది. 18 ఏళ్ల క్రితం తన తల్లిని కేన్సర్ పొట్టన పెట్టుకుందంటూ ప్రకటించిన హంసా.. ధైర్యంగా క్యాన్సర్ తో పోరాటం చేసింది. చివరికి జయించింది.. క్యాన్సర్ నయం అయ్యి దాదాపు రెండేళ్లు అవుతున్న తెలుగు సినిమాల్లో కనిపించలేదు.. కనీసం సినిమాను కూడా అనౌన్స్ చెయ్యలేదు.. దాంతో ఈ అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పిందనే వార్తలు కూడా ఊపందుకున్నాయి.. ఇక ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ ను షేర్ చేస్తూ వస్తుంది..
మొన్నీమధ్య స్పిరుచ్యూవల్ లుక్ లోకి మారిపోయింది.ఆశ్రమంలో చేరింది.ఆద్యాత్మిక చింతనలో మునిగిపోయింది. ఇలా ఆధ్యాత్మిక చింతనలో ఉన్న ఈమె సోషల్ మీడియా వేదిక గా చేసిన ఒక పోస్ట్ బాగా వైరల్ గా మారింది.. ఆ తర్వాత ఇప్పుడు మరి కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.. గ్లామర్ లుక్ లో హాట్ అందాలతో కుర్రాళ్లకు హీటేక్కిస్తుంది.. నడుము అందాలతో యువతకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఆ డ్రెస్సులో దేవకన్యలా ఉంది.. అయితే ఏదో షూటింగ్ కు వెళ్తుందా, ఏదైనా డ్యాన్స్ పెర్ఫార్మన్స్ చేస్తుందా అనేది తెలియలేదు కానీ ఆ ఫోటోలు మాత్రం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. హంసా ఈజ్ బ్యాక్ అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి..