NTV Telugu Site icon

Facebook : ఇది మీకు తెలుసా.. ఒకే ఖాతాలో ప‌లు ప్రొఫైల్స్‌

Facebook

Facebook

ఫేస్‌ బుక్‌ తన వినయోగదారులకు మెరుగైన సేవలందించడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా మరో ఫీచర్‌ను తీసుకురానుంది ఫేస్‌బుక్‌. యూజ‌ర్లు ఒకే ఖాతాలో ప‌లు ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు మెటా కసరత్తలు చేస్తోంది. ఈ ఫీచ‌ర్‌ను త్వ‌ర‌లోనే త‌మ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు ఫేస్‌బుక్ సన్నాహాలు చేస్తోంది. ఫేస్‌బుక్ ప్ర‌స్తుతం ఈ ఫీచ‌ర్‌ను త‌న ప్లాట్‌ఫాంపై పరీక్షిస్తున్నట్లు వెల్లడించింది. భిన్న ప్రొఫైల్స్‌ను భిన్న‌మైన వ్య‌క్తుల‌తో యూజ‌ర్లు పంచుకునేలా ఈ ఫీచ‌ర్‌పై ఫేస్‌బుక్ పరీక్షిస్తున్నట్లు, ఉదాహ‌ర‌ణ‌కు ఓ యూజ‌ర్ త‌న స‌హోద్యోగుల కోసం ఓ ప్రొఫైల్‌ను నిర్వ‌హించ‌డంతో పాటు ఫ్రెండ్స్ కోసం డెడికేటెడ్‌గా మ‌రో ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవ‌చ్చు అన్న మాట.

 

ఫేస్‌బుక్‌లో ప్ర‌స్తుతం ప‌లు ఖాతాల‌ను నిర్వ‌హించే వెసులుబాటు ఉన్నా ప్ర‌తి ఖాతాకు డిఫ‌రెంట్ ఐడీల‌ను వాడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఫేస్‌ బుక్‌ తీసుకుస్తున్న కొత్త ఫీచర్‌తో ఒకే ఖాతాలో మల్టీపుల్‌ ప్రొఫెల్స్‌ను వినియోగించవచ్చు. అంతేకాకుండా ఈ ఫీచర్‌తో ఫేస్‌ బుక్‌ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని మెటా తెలిపింది. ఇప్పటికే ఒకే వ్యక్తి పలు అకౌంట్ల కలిగి ఉండటాన్ని మేము గ్రహించామని, అందుకే ఒకే వ్యక్తి మల్టీపుల్‌ ఒక ఖాతాలో మల్టీపుల్‌ ప్రొఫైల్స్‌ ఏర్పాటు చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది మెటా.