Site icon NTV Telugu

అప్పుడు స్వ‌ర్ణ‌ప‌త‌కాలు గెలిచాడు…ఇప్పుడు బ‌తుకు జీవ‌నం కోసం…

ఒకప్పుడు అత‌ను క‌బ‌డ్డీలో ఛాంపియ‌న్‌.  రాష్ట్రం త‌ర‌పున క‌బ‌డ్డీ పోటీల్లో అనేక ప‌త‌కాలు సాధించాడు.  పేద కుటుంబంలో పుట్ట‌డం వ‌ల‌న తల్లిదండ్రులు క‌ష్ట‌ప‌డి చ‌దివించారు.  కొడుకు క‌బ‌డ్డీ పోటీల్లో పాల్గొనేందుకు అవ‌స‌ర‌మైన చేయాత‌ను అందించారు.  వారి క‌ష్టం ఊరికే పోలేదు.  కొడుకు రాష్ట్ర‌స్థాయిలో రాణించాడు.  మంచి ప్ర‌తిభ‌ను చాటుకున్నాడు.  ఇదంతా గ‌తం.  ప్ర‌స్తుతం తల్లిదండ్రులు వార్ధక్యంలో ఉండ‌టం వ‌ల‌న వారికి చేదోడు వాదోడుగా ఉండేందుకు బ‌డ్డీకొట్టు న‌డుపుతున్నాడు.  వ‌చ్చిన కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

Read: “ఛత్రపతి” రీమేక్ లో హీరోయిన్ ఫిక్స్

పేద‌రికంలో ఉండ‌టం వ‌ల‌న త‌న‌కు క‌బ‌డ్డీ గేమ్స్‌లో పార్టిసిపేట్ చేసేందుకు ఎవ‌రూ స‌హాయం చేయ‌లేద‌ని, ఎవ‌రైనా స‌హాయం చేస్తే జాతీయ స్థాయిలో రాణిస్తాన‌ని చెబుతున్నాడు జార్ఖండ్‌కు చెందిన క‌బ‌డ్డీ క్రీడాకారుడు రాహుల్ కుమార్‌.  2017 నుంచి 2019 వ‌ర‌కు క‌బ‌డ్డీ క్రీడ‌ల్లో రాణించాడు.  అయితే, ప్ర‌స్తుతం కుటుంబాన్ని పోషించుకోవ‌డానికి బ‌డ్డీ కొట్టు న‌డుపుతున్న‌ట్టు రాహుల్ పేర్కొన్నారు.  త‌న కుమారుడికి క‌బ‌డ్డీ గేమ్ అంటే చాలా ఇష్ట‌మ‌ని, దానికోసం ఎంత క‌ష్ట‌మైనా ప‌డ‌తాడ‌ని, ఎవ‌రైనా స‌హాయం చేస్తే మంచిగా రాణిస్తాడ‌ని రాహుల్ తల్లి చెబుతున్న‌ది.  

Exit mobile version