నా క్రమశిక్షణకు విష్ణు వారసుడు: మోహన్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మా’ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడింది. అటు ప్రకాశ్ రాజ్, ఇటు విష్ణు పానెల్స్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. రెండు ప్యానల్స్ కి మద్దతుగా గళం విప్పుతున్నవారు ఉన్నారు. తాజాగా తన కుమారుడు మంచు విష్ణుకి ఓటు వేయాలని అభ్యర్ధిస్తూ మోహన్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు. తన క్రమశిక్షణకు, కమిట్ మెంట్ కి విష్ణు వారసుడని చెబుతూ తను ఇక్కడే ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా పక్కన నిలబడతాడనే హామీని ఇస్తున్నానని, విష్ణుతో పాటు పూర్తి ప్యానెల్ కి ఓటు వేసి సమర్ధవంతమైన పాలనకు సహకరించాలని కోరారు మోహన్ బాబు.
Read Also : ప్రకాష్ రాజ్ పై కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు
Also Read
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
తను మా అధ్యక్ష పదవిలో ఉన్నపుడే వృద్ధాప్య ఫించన్లు ప్రవేశపెట్టిన సంగతి గుర్తు చేస్తూ మా అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదని, బాధ్యత అని అంటున్నారాయన. ఇండస్ట్రీలో ఎవరి ఏ కష్టం వచ్చినా తనున్నానని ముందు నిలబడ్డ దాసరి నారాణరావు గారి అడుగుజాడల్లో నడుస్తున్న వాడినని, 1982లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్థాపించిన రోజు నుంచి ఇప్పటి వరకూ సినిమాలు నిర్మిస్తూ కొత్త కొత్త సాంకేతిక నిపుణులను, కళాకారులను పరిచయం చేయటమే కాకుండా 24 క్రాప్ట్స్ లో ఉన్న వారి పిల్లలకు తను స్థాపించిన విద్యా సంస్థలలో ఉచితంగా విద్యా సౌకర్యాలు కల్పించానని, ఇకపై కూడా అది కొనసాగుతుందని చెప్పారు మోహన్ బాబు. ఓటును ఆలోచించి అందరి బాగు కోసం తాపత్రయపడుతున్న తన కుమారుడు మంచు విష్ణు ప్యానెల్ కి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు మోహన్ బాబు.

తాజావార్తలు
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్‌ను పట్టించుకోడా?
-
King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!