ప్రకాష్ రాజ్ పై కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు అక్టోబర్ 10న జరగనున్నాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రధాన పోటీదారులు. ప్రకాష్ రాజ్ కు మెగా సపోర్ట్ ఉందని నాగబాబు స్వయంగా ప్రకటించగా, మంచు విష్ణుకు కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ వంటి హీరోలతో పాటు లోకల్ అనే నినాదానికి కట్టుబడి ఉన్న మరికొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో లోకల్, నాన్ లోకల్ ఇష్యూ చెలరేగింది. ఇక మరో రెండ్రోజుల్లో ‘మా’ ఎన్నికలు ఉండడంతో అధ్యక్ష పదవిని ఎవరికి పట్టం కడతారో అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యములో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ప్రకాష్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also : “మా” ఎన్నికల్లో వాళ్ళకే నా సపోర్ట్ : రోజా

తాజాగా ‘మా’ ఎలక్షన్స్ గురించి మాట్లాడిన కోట “నేను మంచు విష్ణుకి సపోర్ట్ చేస్తాను. ‘మా’ అధ్యక్షుడిగా నిలబడడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. ప్రకాష్ రాజ్ నటన గురించి ఏం మాట్లాడను. నేను నేషనల్ లెవెల్ నటుడిని, నాకు నంది వంటి అవార్డులు వచ్చాయి అని నేను చెప్పుకోను. కానీ ప్రకాష్ రాజ్ గురించి ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ప్రకాష్ రాజ్ తో నేను 15 సినిమాలు చేశాను. అన్నీ మెయిన్ రోల్సే. అతను ఎప్పుడూ టైంకి షూటింగ్ కి రాడు. ఆలోచించి ఓటు వేయండి. మంచు విష్ణుని గెలిపించండి” అని చెప్పుకొచ్చారు.

-Advertisement-ప్రకాష్ రాజ్ పై కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

Related Articles

Latest Articles