వ్యాక్సినేషన్ పై ప్రధాని మోడీ కీలక ప్రకటన.. ఇక దేశమంతా ఫ్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. ఈ మేరకు జూన్ 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామన్నారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారు. అలాగే కేంద్రం పరిధిలోనే వ్యాక్సిన్ ప్రక్రియ ఉండనున్నట్లు తెలిపారు. కరోనాను అంతం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ శతాబ్దంలోనే ఇది అత్యంత ఘోరమైన విషాదం అని.. దేశ చరిత్రలో ఇంత మెడికల్ ఆక్సిజన్ అవసరం ఎప్పుడూ రాలేదని పేర్కొన్నారు. కరోనా వల్ల దేశ ప్రజలు ఎంతో బాధ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక యుగంలో ఇలాంటి మహమ్మారి ఏనాడు రాలేదన్నారు. ప్రపంచంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు చాలా తక్కువ అని.. మనం వ్యాక్సిన్ ఉత్పత్తి చేసుకోకపోతే విదేశాల నుంచి రావడానికి ఏళ్లు పట్టేందని గుర్తు చేశారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నీ ఉపయోగించి ఆక్సిజన్ కొరత తీర్చుతున్నామని తెలిపారు. ఆధునిక కాలంలో ఇలాంటి మహ విపత్తు ఎప్పుడూ రాలేదని గత వందేళ్లలో ఇదే అతిపెద్ద మహమ్మారి అని వెల్లడించారు. దేశంలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని 10 కోట్లకు మించి పెంచామనీ… అతి తక్కువ సమయంలోనే మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని 10 రేట్లకు మించి పెంచామని అన్నారు.
Also Read
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- Tags
- Covid19
- PM Modi
- second wave
- vaccine
తాజావార్తలు
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!