మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో కూడా ఆయన ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అతి తక్కువ సమయంలోనే ఆయనకు అనూహ్యంగా అభిమానుల సంఖ్య పెరిగిపోయింది. తాజాగా ఆయన ఇన్స్టాగ్రామ్ లో మరో మైలు రాయిని దాటారు. ఇన్స్టాలో చరణ్ 4 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ను దాటడం విశేషం. ఈ పాన్ ఇండియా స్టార్ కు క్రేజ్ మామూలుగా లేదు. ఆయన ఇన్స్టాలో ఇప్పటివరకు చేసిన పోస్టులు కేవలం 139 మాత్రమే కావడం గమనార్హం. ప్రస్తుతం రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్” చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు.
Read Also : నీ బిహేవియర్ కు ఇండస్ట్రీ గేట్ లోకి రాలేవు అన్నారు : బీవీఎస్ రవి
రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అలియా భట్, ఒవిలియా మోరిస్, అజయ్ దేవగన్ తదితర స్టార్స్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం పూర్తి కానుంది. ఆ తరువాత శంకర్ కాంబినేషన్ లో మరో పాన్ ఇండియా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు చరణ్. ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి “ఆర్సి15” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. “ఆర్ఆర్ఆర్” పూర్తవ్వగానే ఈ చిత్రం ప్రారంభం అవుతుంది.