Site icon NTV Telugu

Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

Wrong Delivery

Wrong Delivery

ప్రేమించిన వ్యక్తికి తన ప్రేమను తెలియజేసే పద్ధతి వినూత్నంగా ఉండాలని కొత్త కొత్త ఆలోచనలతో లవ్‌ ప్రపోజ్‌ చేస్తుంటారు. లవ్‌ ప్రపోజ్‌కు సంబంధించిన చాలా వీడియోలు మనం చూసేం ఉంటాం. అయితే ఇలాంటి వారి కోసమే విదేశాల్లోని ఓ మెక్‌డొనాల్డ్స్‌ ‘రొమాంటిక్‌ మీల్‌’ పేరుతో ఓ స్కీంను ప్రవేశపెట్టింది. ఎవరైనా తమ ప్రేమను వారి వారి లవర్స్‌కు తెలియజేసేందుకు ఈ రొమాంటిక్‌ మీల్‌ ద్వారి తెలియజేయవచ్చు. అయితే.. ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు లవ్‌ ప్రపోజ్‌ చేసేందుకు.. రొమాంటిక్‌ మీల్‌ను ఆర్డర్‌ చేసింది. తన బాయ్‌ఫ్రెండ్‌ ఉండే ఫ్లాట్‌కు రెండు కోక్‌లతో కూడిన ఫుడ్‌ రొమాంటిక్‌ మీల్‌ను బుక్ చేయడమే కాకుండా.. అందులో ‘కిమ్‌ నన్ను పెళ్లి చేసుకుంటావా..?’ అంటూ రెండు లవ్‌ సింబల్స్‌ వేసి ప్రపొజల్‌ పంపింది.

అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఆ ఫుడ్‌ కూడా డెలివరీ అయ్యింది. కానీ.. వేరే అడ్రస్‌లో.. దీంతో.. వేరే చిరునామలోని వ్యక్తి ఆ పార్సిల్‌లో ఉన్న ఫుడ్‌తో పాటు ఆ లవ్‌ ప్రపోజల్‌ను చూసి మొదట షాక్‌ తిన్నాడు. కానీ.. తరువాత అర్థం చేసుకొని.. ఎవరికో పంపాల్సిన లవ్‌ ప్రపొజల్‌ నాకు వచ్చింది.. అంటూ నెట్టింట్లో లవ్‌ ప్రపోజల్‌ ఫోటోను షేర్‌ చేశాడు. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతూ వైరల్‌గా మార్చారు.

Exit mobile version