Site icon NTV Telugu

తీవ్ర విషాదంలో ‘ఫ్యామిలీ మ్యాన్’

Manoj Bajpayee's father passes away

‘ఫ్యామిలీ మ్యాన్’ నటుడు మనోజ్ బాజ్‌పేయి తండ్రి రాధాకాంత్ బాజ్‌పేయి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం బాగుండక పోవడంతో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన పరిస్థితి విషమంగా మారడంతో ఢిల్లీలోని ఆసుపత్రిలో చేర్చారు. మనోజ్ కూడా తండ్రి పరిస్థితి బాలేకపోవడంతో షూటింగ్లను వదిలేసి తండ్రి దగ్గరే ఉన్నారని సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో ఈరోజు తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.

Read Also : డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు అరెస్ట్

ఎలాంటి సపోర్ట్ లేకుండానే బాలీవుడ్ స్టార్ రేంజ్ కు ఎదిగిన మనోజ్ కు తల్లిదండ్రులంటే ఎంతో ప్రేమ. ఈ విషయాన్నీ ఆయన పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ఇక ఈ నటుడు ”ఫ్యామిలీ మ్యాన్” వెబ్ సిరీస్ తో ఉత్తరాదితో పాటు సౌత్ లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

Exit mobile version