Mahesh Babu : గణేష్ నిమజ్జనం ఉత్సవాలలో సితార, గౌతమ్.. ఫోటోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి.. సాధారణ ప్రజల నుంచి సినీ తారల వరకు అందరు గణేష్ చతుర్థిని ఘనంగా జరుపుకుంటున్నారు.. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఇంట్లో కూడా వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయని చెప్పాలి. వినాయక చవితి పండుగ రోజు సితార దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే నమ్రత కుటుంబం మొత్తం వినాయక చవితి పూజలో పాల్గొన్నటువంటి వీడియోని కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తాజాగా వినాయక చవితి నిమజ్జనం ఉత్సవాలలో భాగంగా మహేష్ బాబు పిల్లలు సితార గౌతమ్ పాల్గొని సందడి చేశారు. తమ ఇంట్లో ఏర్పాటు చేసినటువంటి వినాయకుడిని తమ ఇంట్లో పని వాళ్ళతో కలిసి గౌతమ్ సితార నిమర్జనం కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇక ఈ ఉత్సవాలలో మహేష్ నమ్రత ఎక్కడ పాల్గొనలేదు.. ఆ ఫోటోలల్లో గౌతమ్ విగ్రహాన్ని ఎత్తుకున్నారు.. ఇక మహేష్ ఇంట్లో ఉండే పనివాళ్లంతా నిమజ్జనం చేసేందుకు రెడీ అయ్యారు.. తమ ఇంటి పెరట్లో ఏర్పాటు చేసినటువంటి ఒక డ్రమ్ములో వినాయకుడి నిమర్జనం చేశారు..
Also Read
- Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
- Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
- Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
- Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
ఈ నిమర్జనం వీడియోను నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన మాతృభాష అయినటువంటి మరాఠీలో గణపతి బప్పా మోరియా..వచ్చే ఏడాది మళ్లీ రా అంటూ రాసుకు వచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్స్ ఈ వీడియో పై లైక్స్ కామెంట్స్ చేస్తున్నారు. గౌతమ్ ఇన్ని రోజులపాటు సోషల్ మీడియాకు కాస్త దూరంగానే ఉన్నా, ఈ మధ్యకాలంలో ఈయన కూడా సోషల్ మీడియాలో చురుగ్గా కనిపిస్తున్నారు.. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు.. షూటింగ్ దశలో ఉన్న ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది..
#namratasirodhkar #Maheshbabu pic.twitter.com/zc57KDhWuD
— Sai vineeth(Journalist🇮🇳) (@SmRtysai) September 22, 2023
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!