NTV Telugu Site icon

Mahesh Babu : మహేష్ బాబు ధరించిన ఈ చెప్పులు ధర ఎన్ని వేలో తెలుసా ?

Gunturkaram

Gunturkaram

పండగలు వచ్చాయంటే సినిమాల అప్డేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.. ఫ్యాన్స్ కు పండగే.. తమ హీరోల సినిమాల నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తారు.. ఇక తాజాగా దసరా, విజయదశమి పండుగలను పురస్కరించుకుని వరుసగా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ను అందిస్తూ వస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, OG ల నుండి అప్డేట్స్ రాగా, తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం మూవీ నుండి సూపర్ అప్డేట్ వచ్చింది..

ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను త్వరలోనే విడుదల చేస్తామంటూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్ లో మహేష్ బాబు కారు డిక్కీలో కూర్చుని స్టైల్ గా బీడీ కాలుస్తున్నాడు, కానీ అప్పటికే ఒక రౌడీ ని కొట్టి కింద కూర్చోపెట్టేశాడు.. కారుకు ఒక వేట కత్తి కూడా గుచ్చుకుని ఉంది. ఈ పోస్టర్ ను చూస్తే ఒక మంచి ఫైట్ సీన్ కు సంబంధించిన స్టిల్ అని అర్ధమవుతోంది.. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. మహేష్ పోస్టర్ లో వేసుకున్న చెప్పుల ధర గురించి పెద్ద చర్చే నడుస్తుంది.. ఎకో అఫ్రోడ్ అనే కంపెనీ తయారు చేసింది.. దీని ధర రూ.7,999 ఉంది.. మొన్నటి వరకు షర్ట్.. ఇప్పుడు చెప్పులు హాట్ టాపిక్ అవుతున్నాయి.. గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ ఖాయమని అభిమానులు ఆశతో ఉన్నారు. గతంలో అతడు, ఖలేజా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి..వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది..

Show comments