Site icon NTV Telugu

ఇంజ‌నీర్ బ‌న్‌గ‌యా చాయ్‌వాలా…

ఒక‌ప్పుడు చ‌దివిన చ‌దువుకు త‌గిన ఉద్యోగం ల‌భిస్తుండేది.  కానీ, ఇప్పుడు డిగ్రీలు, పీహెచ్‌డీలు చేసిన వారు కూడా క్ల‌ర్క్ జాబ్‌కోసం ట్రై చెయాల్సిన ప‌రిస్థితులు ఉన్నాయి.  ఎంత ఎక్కువ చ‌దువుకుంటే అంత నిరుద్యోగం అనె లెక్క‌న మారిపోయింది.  చ‌దువుకున్న చ‌దువు అక్క‌ర‌కు రాక‌పోతే న‌చ్చిన వ‌చ్చిన ప‌నులు చేసుకుంటూ నాలుగు రూక‌లు సంపాదించి కుటుంబాన్ని న‌డుపుతున్న వ్య‌క్తులు ఎంతో మంది ఉన్నారు.  అలాంటి వారిలో ఒక‌రు అమీర్ సోహైల్‌.  మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్ చ‌దివి చిన్న ఉద్యోగం చేస్తున్న‌ప్ప‌టికీ వ‌స్తున్న జీతం కుటుంబ అవ‌స‌రాలకు స‌రిపోక‌పోవ‌డంతో టీ దుకాణం పెట్టుకొని హాయిగా జీవ‌నం సాగిస్తున్నాడు.  క‌ర్ణాట‌క‌లోని బాల‌గ‌కోటెలో ఇంజ‌నీర్ బ‌న్‌గ‌యా చాయ్‌వాలా అనే పేరుతో చాయ్ దుకాణాన్ని ఓపెన్ చేశాడు.  అన‌తికాలంలోనే చాయ్ దుకాణం అక‌ట్టుకుంది.  దీంతో రోజుకు మంచి ఆదాయం ల‌భిస్తుండ‌టంతో హ్యాపీగా ఉన్నాన‌ని అంటున్నాడు అమీర్‌.  క‌రోనాకు ముందు రోజుకు వెయ్యి క‌ప్పుల వ‌ర‌కు టీ అమ్ముడు పోయేద‌ని, క‌రోనా త‌రువాత రోజుకు 500 క‌ప్పుల చాయ్ అమ్ముతున్న‌ట్టు అమీర్ పేర్కొన్నారు.  

Read:

Exit mobile version