NTV Telugu Site icon

Hyderabad: హ్యాట్సాఫ్ ఖాకీలు..పేషంట్ ప్రాణాలను కాపాడిన పోలీసులు..

Hderabad (2)

Hderabad (2)

అంబులెన్స్ సౌండ్ వినగానే వెంటనే దారి ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడటానికి అందరు సహకరిస్తారు.. అందులో వెళ్లే పేషంట్ పరిస్థితి ఎంత విషమంగా ఉందో అని కంగారు పడతారు.. అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మానవత్వం..కొన్ని సార్లు ట్రాఫిక్ లో అంబులెన్సు లు ఆగిపోతుంటాయి.. అలాంటి సమయంలో అందరు సాయం చేసి ఆ అంబులెన్స్ లోని పేషంట్ ప్రాణాలను కాపాడతారు.. అయితే తాజాగా హైదరాబాద్ లో ఓ ఘటన చోటు చేసుకుంది..

ఒక పేషెంట్ ను వెంటిలేటర్ మీద హాస్పిటల్‌కు, తరలిస్తున్న క్రమంలో దారి మధ్యలో వెళ్తున్న అంబులెన్స్ ఒకసారిగా బ్రేక్ డౌన్ అయిపోయింది. చాలా సేపటి వరకు అంబులెన్స్‌ను అక్కడ ఉండే యువకులు వెనుకవైపు నుంచి నెట్టే ప్రయత్నం చేశారు. అయినా అంబులెన్స్‌ను కదిలించలేకపోయారు. దాంతో అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ టోయింగ్ వాహన సిబ్బందికి ఫోన్ చేశాడు. నిమిషాల్లో అక్కడికి చేరుకున్న టోయింగ్ సిబ్బంది అంబులెన్స్ టోయింగ్ వాహనంతో జతపరిచారు. టోయింగ్ వాహనం వెళుతున్న వాటికి సాధారణంగానే సైరన్ సౌండ్ ఉంటుంది. దీనికి తోడు ఆ టోయింగ్ వాహనానికి అంబులెన్స్ జతపట్టి లాగటంతో ఆ అంబులెన్సు సకాలంలో ఆసుపత్రికి చేరింది..

ఆ సమయంలో పోలీసులు చేసిన సాయం మరువలేనిది.. దీన్ని చూసిన స్థానికులు అంతా వారిపై ప్రశంసలు కురిపించారు.. ఇందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ ఘటన హబ్సిగూడ మెట్రో స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కు పేషంట్‌ను అంబులెన్స్‌లో తరలిస్తున్న క్రమంలో హబ్సిగూడ మెట్రో వద్దకు రాగానే అంబులెన్స్ ఒకసారిగా బ్రేక్ డౌన్ అయింది. హబ్సిగూడ నుండి సికింద్రాబాద్ యశోద వరకు 8 కిలోమీటర్లు ఉంటుంది. 23 నిమిషాల్లో అక్కడికి చేరుకోవాలి. కానీ కంప్లీట్‌గా అంబులెన్స్ బ్రేక్ డౌన్ అయిపోవడంతో పోలీసులు ఎలా అయినా సరే పేషెంట్ ప్రాణాలు కాపాడాలనుకున్నారు. వెంటనే టోయింగ్ వాహనంతో హబ్సిగూడ నుండి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌కు అంబులెన్స్‌ను టోయింగ్ చేసుకుంటూ వచ్చారు పోలీసులు.. అక్కడ సాయపడిన వారందరిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు..