కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం ఇంకా బయటపడలేదు. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రంగాలకు అనుమతులు ఇచ్చారు. దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు తిరిగి తెరుచుకోవడంతో టూరిస్టుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రదేశాలకు టూరిస్టులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైని ముస్సోరిలోని కెంప్టీ జలపాతాన్ని సందర్శించేందుకు భారీగా తరలి వచ్చారు. కెంప్టీ జలపాతం కింద పర్యాటకు పోటీలుపడి మరీ స్నానాలు చేశారు.
Read: “యూటర్న్” బ్యూటీ హాట్ నెస్ తట్టుకోవడం కష్టమే…!
వందలాది మంది మాస్కులు లేకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా జలపాతం కిందకు చేరారు. ఎంజాయ్ చేశారు. మాములూ సమయాల్లో అయితే నెటిజన్లు అంతగా రియాక్ట్ అయ్యేవారు కాదు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోన్నామో అందరికి తెలుసు కాబట్టి నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. కరోనా నిబంధనలు గాలికి వదిలేయడం తగదని, కరోనా థర్డ్ వేవ్ ముప్పు ప్రమాదం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఎంప్టీ బ్రెయిన్స్ ఎట్ కెంప్టీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కెంప్టీ జలపాతానికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
