“యూటర్న్” బ్యూటీ హాట్ నెస్ తట్టుకోవడం కష్టమే…!

బీటౌన్ యంగ్ బ్యూటీ అలయ ఎఫ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన హాట్ ట్రీట్ తో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. తాజాగా అలయ షేర్ చేసిన పిక్స్ చూస్తే నిద్ర కరువవ్వడం ఖాయం. ఆ రేంజ్ లో రెచ్చిపోయింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసిన ఈ పిక్ లో అలయ తెల్లటి దుస్తులు ధరించి దేవకన్యలా కన్పిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ పిక్ లో ఆమె మెరిసిపోయింది. ఈ బోల్డ్ ఫోటోషూట్ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఇలాంటి హాట్ ఫోటోషూట్లతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటోంది ఈ అమ్మడు.

Read Also : “నారప్ప” డిజిటల్ రిలీజ్ పై వెంకీ రియాక్షన్ !

ఇక నెట్టింట్లో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ వేరు. ఆమెను ఆరాధించేవారు భారీ సంఖ్యలోనే ఉన్నారు. అలయ ఒక్క పిక్ షేర్ చేసిందంటే చాలు అది క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. కాగా బాలీవుడ్ లో సైఫ్ అలీఖాన్ “జవానీ జానెమాన్” చిత్రంతో అరంగేట్రం చేసింది అలయ. ప్రస్తుతం ఈ బ్యూటీ ఏక్తా కపూర్ నిర్మాతగా తెరకెక్కనున్న “యూటర్న్” హిందీ రీమేక్ లో హీరోయిన్ గా ఎంపికైంది. ఈ విషయమై ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-