Site icon NTV Telugu

Covid 4th Wave: ఫోర్త్ వేవ్ లో కరోనా బారిన పడేవారు వీరే!

Covdi1

Covdi1

4th వేవ్ లో కరోనా బారిన పడేవారు వీరే..! | Ntv Health Telugu

దేశంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదా? ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి వుందా? అంటే అవుననే అంటున్నారు డాక్టర్లు.వివిధ రకాల ఆరోగ్య ఇబ్బందులు వున్నవారు, వృద్ధులు, గుండెజబ్బులు, కిడ్నీ రోగాలు వున్నవారు ఈ ఫోర్త్ వేవ్ వల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం వుంది. షుగర్ పేషెంట్లు షుగర్ కంట్రోల్ లో వుంచుకోవాలని డాక్టర్ వసీం సూచిస్తున్నారు.

అలాగే, వైద్య ఆరోగ్య శాఖ (medical health department) అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అయితే అంతగా ఆందోళన చెందవద్దని కోరారు. పెళ్లిల్లు, ఇతర విందులు, సామూహిక కార్యక్రమాలు, విహార యాత్రలు నిరభ్యంతరంగా జరుపుకోవచ్చంటున్నారు. జనంలోకి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలని కోరుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 90శాతం మందికి కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు తేలిందన్నారు. 12 ఏళ్లు పైబడిన పిల్లలకు టీకాలను ఇప్పించాలని, 60 ఏళ్లు దాటిన వారు బూస్టర్‌ డోసు తీసుకోవాలని సూచించారు.

Exit mobile version