Site icon NTV Telugu

Elon Musk: ట్విట్టర్‌లో వాటా కొనుగోలు చేసిన ప్రపంచ కుబేరుడు

Elon Musk

Elon Musk

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సోషల్ మీడియా రంగంలోకి అడుగపెట్టారు. ఆయన తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో వాటాను కొనుగోలు చేశారు. ఈ మేరకు మార్చి 14 నాటికి 9.2 శాతం వాటాను ఎలన్ మస్క్ దక్కించుకున్నారు. ట్విట్టర్‌కు సంబంధించి మస్క్ 7,34,86,938 షేర్లు కొనుగోలు చేసినట్లు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ తెలిపింది. దీంతో ట్విట్టర్ షేర్ల విలువ 28 శాతం పెరిగింది. ట్విట్టర్ షేర్ల వాల్యూ ప్రస్తుతం 3.6 బిలియన్ డాలర్ల వరకు పలుకుతున్నాయి.

కాగా ట్విట్టర్‌లో వాటా కోనుగోలుతో అతి పెద్ద షేర్ హోల్డర్‌గా ఎలన్ మస్క్ నిలిచారు. కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రూపొందించాలని ఇటీవల ఓ ట్విటర్ యూజర్ ఎలన్ మస్క్‌ను కోరాడు. ఈ ట్వీట్‌పై ఎలన్ మస్క్ స్పందిస్తూ తాను ఈ విషయంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఈ చర్చ జరిగిన కొద్దిరోజుల్లోనే ట్విట్టర్‌లో మస్క్ షేర్లు కొనుగోలు చేయడం విశేషం. కాగా ఎలన్ మస్క్‌ను ట్విట్టర్‌లో 80 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అయితే ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే ఎలన్ మస్క్ గతంలో పలుమార్లు ట్విట్టర్‌పై విమర్శలు కూడా చేశారు. యూజర్ల వాక్‌ స్వాతంత్ర్యాన్ని ట్విట్టర్ దెబ్బతీస్తోందని ఆరోపించారు.

https://ntvtelugu.com/microsoft-acquires-data-process-mining-vendor-minit/

Exit mobile version