Site icon NTV Telugu

రవితేజ ఈడీ విచారణ ప్రారంభం… అతనే కీలకం !

ED Starts Questioning Raviteja

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈడీ ముందు హాజరయ్యాడు రవితేజ. డ్రైవర్ తో కలిసి తన బ్యాంకు డీటెయిల్స్ కు సంబంధించిన ఫైల్స్ తో ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి సరైన సమయానికి ఈడీ ఆఫీస్ ముందు హాజరయ్యారు. తాజాగా ఈడీ రవితేజ విచారణను ప్రారంభించింది. ఈడీ దర్యాప్తులో రవితేజ డ్రైవర్ శ్రీనివాస కీలకం. ఎందుకంటే ఈ కేసు అతని పట్టుకోవడం ద్వారానే వెలుగులోకి వచ్చింది. ఎక్సయిజ్ శాఖ ఈ కేసులో ముందుగా శ్రీనివాస్ ని పట్టుకున్నారు. ఆ తరువాత అతని ద్వారా టాలీవుడ్ డ్రగ్స్ లింక్స్ బయటపడ్డాయి.

Read Also : టాలీవుడ్ డ్రగ్స్ కేసు : ఈడీ కార్యాలయానికి చేరుకున్న రవితేజ

శ్రీనివాస్ ద్వారా ఎక్సయిజ్ ప్రత్యేక దర్యాప్తు బృందం కెల్విన్ ను పట్టుకుంది. ఇద్దరినీ విచారించగా నటీనటుల డ్రగ్స్ వాడకం బండారం మొత్తం బయట పెట్టేశారు. అలా డ్రగ్స్ లింక్స్ బయటపడడంతో సినిమా నటీనటులకు నోటీసిచ్చి ఎక్సైజ్ శాఖ అరెస్టు చేసింది. ఈ కేసులో శ్రీనివాస్, కెల్విన్, ఎఫ్ లాంజ్ పబ్ మేనేజర్ల బ్యాంకు లావాదేవీల కీలకంగా మారాయి. శ్రీనివాస్ ద్వారా టాలీవుడ్ కు డ్రక్స్ సరఫరా అయినట్లుగా అధికారులు గుర్తించారు. తాజాగా విచారణకు హాజరైన రవితేజ, శ్రీనివాస్ బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన స్టేట్మెంట్ ను ఈడి అధికారులకు ఇచ్చారు. ఆ లావాదేవీలు, డ్రగ్స్ కు సంబంధించి ఈడీ అధికారుల విచారణ కొనసాగనుంది.

Exit mobile version