టాలీవుడ్ డ్రగ్స్ కేసు : ఈడీ కార్యాలయానికి చేరుకున్న రవితేజ

టాలీవుడ్ హీరో రవితేజ ఈడీ కార్యాలయానికి చేరుకున్నాడు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న తారలంతా వరుసగా ఈడీ ముందు హాజరవుతున్నారు. ఈ రోజు ఈడీ విచారణకు రవితేజ వంతు వచ్చింది. గెస్ట్ హౌజ్ నుండి బయల్దేరిన రవితేజ తో పాటు అతని డ్రైవర్ శ్రీనివాస్ విచారణకు ఈడి ముందు హాజరయ్యారు. 2017లో ఎక్సైజ్ కేసులో రవితేజ విచారణ ఎదుర్కొన్నాడు. 10 గంటలు విచారించిన ఎక్సైజ్ అధికారులతో ఆయన డ్రగ్స్ కి అలవాటు పడ్డ తన తమ్ముళ్లనే దూరం పెట్టాను అంటూ అప్పట్లో వివరణ ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది. ఈరోజు మరోసారి ఈడీ ఆయనను విచారించనుండగా, బ్యాంక్ స్టేట్మెంట్, రికార్డ్స్ తో సరిగ్గా 10 గంటలకు ఈడీ ముందుకు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ తో సహా వచ్చారు.

నవదీప్ ఎఫ్ క్లబ్ చుట్టూ కేసు
నవదీప్ కి చెందిన ఎఫ్ క్లబ్ ఈ డ్రగ్స్ కేస్ తిరుగుతోంది. బుధవారం 8 గంటల పాటు రానా విచారణ సాగింది. ఈ కేసులో మొత్తం 5 మంది నటులను ఈడీ విచారించింది. ఇప్పటి వరకు పూరి, ఛార్మీ, రకుల్, నందు, రానా లు విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ కేస్ ప్రధాన నిందితుడు కెల్విన్ సైతం నేడు విచారణకు హాజరు కావాలని, విచారణ పూర్తి అయ్యే వరకు రావాలని అధికారుల ఆదేశించారు.

గెస్ట్ హౌస్ నుండి ఈడి విచారణకు !
ఈడీ విచారణకు వరుసగా హాజరవుతున్న సినీ ఇండస్ట్రీకి చెందిన వారు తమ ఇళ్ల నుంచి కాకుండా గెస్ట్ హౌస్ ల నుంచి వస్తుండడం గమనార్హం. పూరీ, ఛార్మీ, రానా లు హోటల్ నుండి ఉండీ కార్యాలయానికి రాగా రకుల్ గెస్ట్ హౌస్ నుండి చేరుకుంది‌. రవితేజ సైతం ఈడి ఆఫీసుకు ఇంటి నుండి కాకుండా ఫాంహౌస్ నుండి బయల్దేరాడు. పైగా వీరంతా మీడియా కంటపడకుండా ఈడి కార్యాలయానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-