Viral Wedding Card: సాధారణంగా మనుషులకు పేరు ఎలా ఉంటుంది.. అందరు పిలిచే విధంగా ఉంటుంది. కొంతమంది తాతబామ్మల పేరు కలిసేలా పిల్లలకు పెడతారు. ఇంకొంతమంది దేవుళ్ళ పేర్లు కలిసేలా పెడతారు. మరికొంతమంది ప్రేమించినవారికి మర్చిపోలేక.. తమ పిల్లలకు వారి పేర్లు పెట్టుకొని ఆనందిస్తుంటారు. ఇక్కడవరకు అందరికి తెల్సిందే. ఒక అమ్మాయి పేరు ఎలా ఉంటుంది.. ఉదాహరణకు లక్ష్మీ.. పోనీ మహాలక్ష్మీ.. వీర వెంకట మహాలక్ష్మీ.. ఇలా ఉంటుంది. పూర్తి పేరు చెప్పమంటే.. దాదాపు రెండు మూడు పేర్లు కలిసేలా చెప్పడం చూసాం కానీ.. ఇక్కడ మనం చెప్పుకుంటున్న పేరు చూస్తే.. ఒక పేరా అవుతుంది. ఏంటి అంత పెద్ద పేరునా.. ? అంటే .. నిజం.. అంతే పెద్ద పేరు.. ఆ పేరు ఏంటో తెలుసా.. “వీర వెంకట సత్య నాగలక్ష్మి దుర్గా వాసవీ లలితా పార్వతి రాణి సీతా కామాక్షి మాణిక్య కాళీ అచ్యుత భైరవీ ఆకాంక్ష” ఏంటీ .. పేరు చెప్తాను అని శ్లోకం చెప్తున్నారు.. అని అనుకోకండి.. మీరు చదివేది పేరునే.
అంత పెద్ద పేరు ఉన్న అమ్మాయి ఎవరు..? ఏంటి కథ ..? అని చెప్పుకోవాలంటే.. ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ వైరల్ గా మారింది. అందులో వధువు పేరే.. చి.ల. సౌ వీర వెంకట సత్య నాగలక్ష్మి దుర్గా వాసవీ లలితా పార్వతి రాణి సీతా కామాక్షి మాణిక్య కాళీ అచ్యుత భైరవీ ఆకాంక్ష. ఇన్విటేషన్ చూడగానే ఎవరైనా ముహూర్తం ఎప్పుడు.. ? విందు ఎప్పుడు..? అని చూస్తారు.. కానీ ఈ పెళ్లి పత్రిక చూడగానే వధువు పేరునే చూస్తున్నారు. పెళ్లి కూతురు పేరు ఏంటి ఇంతుంది.. ఇంత పేరు ఎవరైనా పెట్టుకుంటారా.. ?అని కొందరు.. అది కాదు భయ్యా.. ఇన్ని పేర్లు ఉన్నాయి కదా.. ఇప్పుడు పెళ్లి తరువాత వరుడు.. ఏ పేరుతో పిలుస్తాడు.. మొత్తం పేరు అమ్మాయికి గుర్తు ఉంటుందంటారా.. ? అంటూ నెటిజన్లు జోక్స్ వేస్తున్నారు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పేరును చూసి మరికొంతమంది.. సెల్లో పెన్ యాడ్ ను గుర్తుచేసుకుంటున్నారు. అందులో పెన్ను బాగా రాస్తుంది అని.. బర్త్ సర్టిఫికేట్ లో కొడుకు పేరును రాస్తూనే ఉంటాడు ఒక తండ్రి. అలానే ఈ వధువు తండ్రి కూడా అలాగే రాసి ఉంటాడని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
