బిగ్ బాస్ ఐదో వారం వీకెండ్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతుంది.. నాగార్జున వచ్చిండంటే చాలు ఆ కిక్ వేరే లెవల్.. ఎంటర్టైన్మెంట్ డబుల్ ఉంటుంది.. నిన్న ఎపిసోడ్ లో క్లాస్ పీకిన నాగ్ ఈరోజు ఎపిసోడ్ వేరే లెవల్ అంటున్నాడు.. తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమో అదిరిపోయింది. ఎప్పుడూ సేఫ్ చేసేవారితో స్టార్ట్ అయ్యే ఎపిసోడ్.. ఈరోజు ఎలిమినేషన్తో మొదలు పెట్టబోతున్నట్లు చెప్పారు నాగార్జున.. ఈరోజుతో ఐదు వారాలు పూర్తి అయ్యింది.. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది.. కాస్త ఆసక్తిగా మారింది..
టాప్ కంటెస్టెంట్స్ ఎవరని అడగ్గా.. ముందుగా అమర్ దీప్.. ప్రశాంత్ పేరు చెప్పారు. దీంతో హౌస్మేట్స్ లేదు అని మిగతా సభ్యులు అనగా.. ముందు అర్థం చేసుకోవాలి అమర్ అన్నారు బిగ్బాస్ . ఇక తర్వాత శివాజీ.. యావర్ పేరు చెప్పారు. అలాగే ప్రియాంక మరొకరి పేరు చెప్తుండగా.. ఐదు వారాల్లో అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు నాగ్. ఇక తర్వాత గౌతమ్, యావర్ శివాజీ పేరు చెప్పారు. అలాగే టేస్టీ తేజ.. ప్రియాంక పేరు చెప్పారు. ఆ తర్వాత నామినేషన్ లో ఉన్నవారిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది కన్ఫార్మ్డ్.. మరి ఎవరు అనేది ఇంకా తెలియలేదు..
ఇక నామినేషన్లో ఉన్న ఇంటి సభ్యులను యాక్టివిటి రూంకు పిలిపించారు.ఎలిమినేట్ అయిన సభ్యుడు అటు నుంచి అటే వెళ్లిపోతారని అన్నారు. ఆ తర్వాత చీకటి గదిలో నామినేట్ అయిన సభ్యులను తీసుకెళ్లగా ఘోస్ట్ గెటప్ లో ఉన్న ఓ వ్యక్తి ఎలిమినేట్ అయ్యే సభ్యుడిని సెలక్ట్ చేయనున్నారు.. అయితే ప్రోమోలో యావర్ చెయ్యిని పైకి లేపుతుంది.. చివరికి ఎవరు వెళ్తారో చూడాలి.. ఇదిలా ఉండగా ఈరోజు మాత్రం ఎపిసోడ్ మాములుగా లేదు.. బిగ్బాస్ 2.0 లో భాగంగా హీరో సిద్ధార్థ్ బిగ్బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంటి సభ్యులతో గేమ్ ఆడించాడు. ఆ తర్వాత మాస్ మాహారాజా రవితేజ బిగ్బాస్ వేదికపై సందడి చేశారు. ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టా.. ఇవాళ ఈవెంట్ వేరేలెవల్ అంటూ చెప్పుకొచ్చారు నాగ్. మొత్తానికి ఈరోజు హౌస్ లోకి నలుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నారు.. ఈరోజు ఎపిసోడ్ ను అస్సలు మిస్ అవ్వకండి..