వి.హనుమంతరావు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. పార్టీలో ఏం జరిగినా ఎవరూ పట్టించుకోకపోయినా వీహెచ్ మాత్రం వెంటనే స్పందిస్తారు. మొహమాటం లేకుండా కొబ్బరి కాయ కొట్టినట్టు మాట్లాడుతుంటారు. తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో బాగా సందడి చేశారు. కోలాటం ఆడి అటు కాంగ్రెస్ కార్యకర్తల్ని, ప్రజల్ని అలరించారు.
ఖమ్మం జిల్లా మధిర మండలంలో సీఎల్పీనేత భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. ఈ పాదయాత్రలో వీహెచ్ పాల్గొన్నారు. కార్యకర్తలను తన మాట, ఆట పాటలతో, కోలాటంతో ఉత్సాహపరిచారు. బడుగులకే రాజ్యాధికారం రావాలన్నారు. తొండల గోపారం, మీనవోలులో సీఎల్పీనేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో హనుమంతరావు పాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. సీఎం కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి హామీని మరిచారని, అందరినీ మోసం చేశారని వీహెచ్ మండిపడ్డారు. మంత్రి పువ్వాడ అజయ్ అరాచకాలు సాగుతున్నాయని, వాటికి అడ్డుకట్ట వేయాలన్నారు. ఆయన అరాచకంతో అమాయకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఖమ్మంలో అన్నిసీట్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తిచేశారు.
Read Also: Ration Cards: కొత్త రేషన్ కార్డుల్లేవ్… పాత కార్డుల్లో మార్పుల్లేవ్