Claude AI Memes: “అబ్‌సల్యూట్ సినిమా”.. క్లాడ్ కొత్త ప్లగిన్స్‌తో ఏఐ అరాచకం! సోషల్ మీడియాలో తుఫాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Claude AI Memes: ఆర్టిఫిషియల్స్ ఇంటలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఎక్కడ చూసిన దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే వాడుకలో ఉన్న ఆంథ్రోపిక్ ఏఐ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. వస్తూ వస్తూ టెక్ కంపెనీలు, ఉద్యోగుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తించింది. తాజాగా ఆంథ్రోపిక్ ఏఐ మరో అడుగు ముందుకేసింది. ఏఐ అసిస్టెంట్ క్లాడ్ (Claude) కోసం కొత్తగా ప్రకటించిన ప్లగిన్ సిస్టమ్ ప్రస్తుతం టెక్ రంగంతో పాటు ఉద్యోగ మార్కెట్‌లోనూ పెద్ద చర్చకు దారితీసింది. కంపెనీల్లో పెట్టుబడి బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్, హెచ్ఆర్, ఫైనాన్స్ వంటి విభాగాల్లో ఈజీగా పని చేసేలా దీన్ని రూపొందించారు. ఇప్పటివరకు ఏఐ టూల్స్ సపోర్ట్ సిస్టమ్‌లుగా మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు ఇవి నేరుగా వర్క్‌ఫ్లోలోకి వచ్చి పనులను ఆటోమేట్ చేయగలవన్న విషయం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా ప్లగిన్లను తామే తయారు చేసుకునేలా ‘Claude Cowork’ ద్వారా ప్రీబిల్ట్ టూల్స్ ఇవ్వడం వల్ల ఏఐ వినియోగం మరింత సులభమవుతోంది. అంతేకాదు, ఈ ప్లగిన్లు ఒకే సంస్థలో కాకుండా, వేర్వేరు టీమ్‌ల మధ్య లేదా ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌తో కూడా షేర్ చేసుకునే విధంగా ఉండటం కార్పొరేట్ వర్క్ కల్చర్‌ను పూర్తిగా మార్చేలా కనిపిస్తోంది.
READ MORE: ENG vs PAK: భారత్‌కే ఐసీసీ సపోర్ట్, ఇది చాలా అన్యాయం.. ఇంజమామ్ సంచలన ఆరోపణలు!
Also Read
- IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
- Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
- Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
- Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
అయితే.. ఈ క్లాడ్ వచ్చిన వెంటనే సోసల్ మీడియాలో రచ్చ మొదలైంది. వెంటనే మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. కొందరు ఈ మార్పును టెక్నాలజీ విప్లవంగా చూస్తున్నారు. మరికొందరు మాత్రం “లేఆఫ్‌లకు రోడ్‌మ్యాప్”గా అభివర్ణిస్తున్నారు. ప్రతి డిపార్ట్‌మెంట్‌కు ప్లగిన్ అంటే.. ఆ విభాగాల్లో పనిచేసే ఉద్యోగాల భవిష్యత్తు ఏమవుతుందన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. “ప్రోడక్ట్ లాంచ్ కాదు.. ఉద్యోగాల రీడిజైన్ ప్రారంభం” అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అంటే, ఉద్యోగాలు ఊడిపోతాయా? లేదా ఉద్యోగాల స్వరూపం మారుతుందా? అనే అంశంపై చర్చ సాగుతోంది. మరికొందరు మాత్రం ఏమాత్రం భయపడల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ వచ్చిన ప్రతీసారి ఉద్యోగాల స్వరూపం మారింది కానీ ఉద్యోగాలు పోలేదని చెబుతున్నారు. సంస్థలు ఎంత వేగంగా అడాప్ట్ అవుతాయో అదే అసలు డిస్రప్షన్‌ని నిర్ణయిస్తుందని చెబుతున్నారు. ఏఐ టూల్స్‌ని ఉపయోగించగలిగిన వారికే రేపటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఈ వాదనలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం వచ్చిన క్లాడ్ ప్లగిన్‌కు సంబంధించిన మీమ్స్ ఇప్పుడు చూద్దాం..
IT company CEOs to Claude: https://t.co/R1LiWtC8FZ pic.twitter.com/vMoHU2rW4k
— Abhishek Murarka 💹🐂 (@abhymurarka) February 24, 2026
IT company CEOs to Claude: https://t.co/R1LiWtC8FZ pic.twitter.com/vMoHU2rW4k
— Abhishek Murarka 💹🐂 (@abhymurarka) February 24, 2026
Claude just wiped out thousands of jobs with a casual launch on a random Tuesday. https://t.co/IPAcatN0sn pic.twitter.com/yQRuSFSUFI
— Andrew Lokenauth | TheFinanceNewsletter.com (@FluentInFinance) February 24, 2026
IT Engineer right now pic.twitter.com/Yp6MIAC9IM
— Baba_Visky (@BabaVisky) February 25, 2026
IT Engineer right now pic.twitter.com/Yp6MIAC9IM
— Baba_Visky (@BabaVisky) February 25, 2026
తాజావార్తలు
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
-
CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
-
YSRCP Nomination Row: ఏపీ స్థానిక ఎన్నికలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు
-
Punganur Violence: పుంగనూరు ఘటనలో.. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు 50 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు!
-
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!