Viral Video: సబ్బు పై కాలేయడంతో మూడో అంతస్థు మీదనుండి జారిపడ్డ మహిళ.. చివరకు..?
- బెంగళూరు మహానగరంలోని కనకానగర్ లో ఘటన.
- బట్టలు ఉఠేకుందుకు వెళ్లిన మహిళ.
- సబ్బు జారడంతో ఘటన.
- కోమాలోకి వెళ్లిన మహిళ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video : ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రమాదవ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం తరచుగా చూస్తూనే ఉన్నాము. తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెంగళూరు నగరంలోని డీజే హల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కనకానగర్ లో ఓ మహిళ భవనంపై నుంచి పొరపాటున కింద పడిన సంఘటన సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూడో అంతస్తు పై ఉన్న ఆ మహిళ బట్టలు ఉతుకేందుకు వెళ్లిన సమయంలో పొరపాటున సబ్బుపై కాలు వేయడంతో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలకు వెళితే..
Bapatla: ఘోర విషాదం, రామాపురం బీచ్‌లో నలుగురు విద్యార్థులు గల్లంతు
Also Read
- Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
- ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
బెంగళూరు మహానగరంలోని డీజేహల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కనకానగర్ లో నివాసం ఉంటున్న ఓ మహిళ వారి ఇంటి పై బట్టలు ఉతికేందుకు వెళ్ళింది. అయితే ఆమె బట్టలు ఉతుకుతున్న సమయంలో పొరపాటున ఆ మహిళ ఓ సబ్బును కాలితో తొక్కింది. దాంతో ఆ మహిళ కాలుజారి బిల్డింగ్ పై నుంచి కింద పడబోయింది. అయితే అదే సమయంలో తన భర్త అక్కడే ఉండి పరిస్థితిని గమనించి వెంటనే కిందపడిపోతున్న తన భార్య చేతులను పట్టుకున్నాడు. ఆమె చేతులను పట్టుకొని పైకి లాగేందుకు ప్రయత్నం చేసినా.. పొరపాటున చేయి జారిపోవడంతో ఆ మహిళ ఒక్కసారిగా కింద పడిపోయింది. అయితే ఆ సమయంలో ఇరుగుపొరుగువారు తీసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Nara Lokesh: అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్
మూడో అంతస్తు నుండి బాధితురాలు కింద పడటంతో ఆవిడకి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన జరిగిన తర్వాత భర్తతోపాటు ఇరుగుపొరుగువారు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆ మహిళ కోమాలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై డీజే హల్లి పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
బిల్డింగ్‌పై నుంచి కింద పడి కోమాలోకి వెళ్లిన మహిళ..
బెంగళూరు – డీజేహళ్లి పోలీస్ స్టేషన్ పరిధి కనకానగర్‌లో ఓ మహిళ భవనంపై నుంచి పొరపాటున కింద పడిపోయింది.
ఆమెను ఓ వ్యక్తి చేతులు పట్టుకుని పైకి లాగేందుకు ప్రయత్నించిన.. చేయి జారిపోవడంతో ఆ మహిళ కింద పడిపోయింది.
బాధితురాలికి తీవ్ర… pic.twitter.com/0SHRoyAWG1
— Telugu Scribe (@TeluguScribe) June 22, 2024
తాజావార్తలు
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!