NTV Telugu Site icon

Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

Traffic Police

Traffic Police

ట్రాఫిక్‌ పోలీసు విధులు అనుకున్నంత సులువు కాదన్నది జగమెరిగిన సత్యం. ఒక్క క్షణం నిర్లక్ష్యం వల్ల పెద్ద ప్రమాదం సంభవించవచ్చు. వారు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండటమే కాకుండా ఎండనక, వాననక విధులు నిర్వర్తిచాల్సి ఉంటుంది. కానీ, ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, వారు ఏదో ఒక ప్రత్యేకమైన పనిని చేయడానికి ముందుకు వెళుతుంటారు. ఇప్పటికే ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిచడమే కాకుండా.. రోడ్డుపై అవస్థలు పడుతున్న వారికి సహాయం చేసిన ఘటనలు వైరల్‌ అయ్యాయి. అయితే.. అలాంటి సంఘటన ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ఐఏఎస్‌ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్న వైరల్ క్లిప్‌లో.. ట్రాఫిక్ రెడ్‌ సిగ్నల్ ఉన్నప్పుడు చీపురుతో రోడ్డుపై ఉన్న చిన్న గులకరాళ్లు, రాళ్లను ఊడుస్తున్న ట్రాఫిక్ పోలీసు కనిపించాడు. రోడ్డుపై వెళ్లే వారికి లేదా వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయన ఇలా చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. “మానవత్వం ఒక విధి కంటే ఎక్కువ, మళ్ళీ నిరూపించబడింది” అని ఒక నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. మరికొందరు ఆ పోలీసును అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.