NTV Telugu Site icon

Nine-year-old Pegrency girl: చిన్నప్పుడే పెళ్లి.. 9ఏళ్లకే గర్భవతి అయిన బాలిక!.. ఎక్కడంటే?

Nine Year Old Pegrency Girl

Nine Year Old Pegrency Girl

ప్రపంచంలోని అనేక దేశాలు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నాయి. మహిళల హక్కులను కాపాడటానికి ప్రయత్నిస్తున్నాయి. ఇరాక్ వివాహ చట్టంలో మార్పు గురించి వచ్చిన వార్తలు ఆందోళన కలిగించాయి. ఇరాక్ ప్రభుత్వం వివాహ చట్టంలో చేయబోయే మార్పుల ప్రకారం.. ఆడపిల్లల వివాహ వయస్సును 18 ఏళ్ల నుంచి 9 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు విమర్శలకు గుప్పిస్తున్నాయి. ఇరాక్ తీసుకున్న ఈ వింత నిర్ణయంపై సోషల్ మీడియాలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా సమాజంలో అసమానతల వృద్ధితోపాటు పిల్లలపై దోపిడీ కూడా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతుంది.

READ MORE: Rahul Gandhi: ఇద్దరు కోటీశ్వరులతో పేదలు పోటీ పడుతున్నారు..

తాజాగా ఓ బాలికకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ బాలికకు ఇప్పటికే వివాహం జరిగిందని.. ఆమె ప్రస్తుతం గర్భవతి అని వాదనలు వినిపిస్తున్నాయి. వినియోగదారులు ఈ వీడియోను మైక్రో బ్లాగింగ్ సైట్‌లో షేర్ చేస్తున్నారు. @NaazAkhtar01 హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్‌ను ఇప్పటివరకు వేలాది మంది చూశారు. దీని కారణంగా ఇరాక్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే.. ఈ వీడియో యొక్క ప్రామాణికతను ఎన్‌టీవీ ధృవీకరించలేదు. ఈ వీడియోపై ఇంకా అధికారిక ప్రకటన, సమాధానం వెలువడలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show comments