Site icon NTV Telugu

Love Marriage: ఆయనకు 80 ఏళ్లు.. ఆమెకు 23 ఏళ్లు.. ఘాటైన ప్రేమ చివరికి..?

Love Marriage

Love Marriage

చాలాసార్లు మనము ప్రేమకు వయసు అవసరం లేదు అన్న సామెత వింటూనే ఉంటాము. అలాగే ప్రేమ గుడ్డిదని కూడా చాలామంది చెబుతుంటారు. ఇందుకు నిదర్శనంగా తాజాగా చైనాలో వింత ప్రేమ వివాహం జరిగింది. దేశంలోనే హెబీ ఫ్రాన్స్ లో ఓ వృద్ధాశ్రమంలో ఈ ప్రేమ కథ మొదలైంది. వృద్ధాశ్రమంలో ఉంటున్న 80 ఏళ్ల వృద్ధుడు లీ, అక్కడే పనిచేసే 23 ఏళ్ల జియా ఫాంగ్ లు ఇద్దరు ప్రేమలో పడ్డారు. మొదట వృద్ధుడు లీ ఉద్యోగిని జియా ను ప్రేమిస్తున్నాడని చెప్పడంతో.. ఆ తర్వాత ఆమె కూడా అతడి లవ్ యాక్సెప్ట్ చేసింది. ఈ విషయం వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం.

Police Arrested: ఆసిఫ్‌నగర్‌ హత్య కేసులో ఐదుగురు అరెస్టు..

మొదట వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే వారి స్నేహం కాస్త ప్రేమగా మారి ఆ తర్వాత పెళ్లికి దారి తీసింది. ఇకపోతే యువతి ఆ వృద్ధుడిలో పరినతి, జ్ఞానాన్ని ఇష్టపడగా.. ఆ వృద్ధుడు ఆ అమ్మాయి అందానికి ఆకర్షితుడయ్యాడు. ఇకపోతే ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబం వివాహానికి అంగీకరించకపోవడంతో., ఆమె బంధువులతో సంబంధాలను తెంపుకొని వృద్ధుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.

TGSRTC: యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీజీఎస్ఆర్టీసీ..

అక్కడి వార్తా సంస్థ ప్రకారం., వారిద్దరి వివాహానికి కుటుంబ సభ్యులు ఎవరు హాజరుకాలేదని తెలుస్తోంది. చిన్న కార్యక్రమంలా వీరి వివాహం జరిగిందని అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే వారిద్దరి మధ్య ఉన్న ప్రేమను తెలిపే ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ గా మారాయి.

Exit mobile version