Site icon NTV Telugu

Controversy Marriage: సభ్యసమాజానికి షాక్: 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మనవడు!

Haryana

Haryana

Controversy Marriage: హర్యానా రాష్ట్రంలోని యమునా నగర్‌ జిల్లా కేంద్రంగా ఓ వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. 21ఏళ్ల యువకుడు మొహమ్మద్ ఇర్ఫాన్ తన 65 ఏళ్ల అమ్మమ్మ సుల్తానా ఖాటూన్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలోనూ తీవ్ర కలకలం రేపుతోంది. అయితే, సుల్తానా భర్త మరణం తర్వాత ఇర్ఫాన్ ఆమెను చూసుకుంటున్నప్పుడు వారి సంబంధం మరింత బలపడింది. అది కాలక్రమేణా ప్రేమగా మారి చివరకు వివాహ బంధంగా మారిపోయింది.

Read Also: Ration Shops: రేషన్ షాప్‌ల వద్ద ‘క్యూఆర్ కోడ్‌’ పోస్టర్లు.. ఫిర్యాదులు స్వీకరించబడును!

అయితే, వారి మధ్య ఉన్న బంధాన్ని పెళ్లిగా మలచుకోవడంతో.. వారి బంధువులతో పాటు గ్రామస్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇక, మతపరంగా, సాంప్రదాయపరంగా ఇది ఏమాత్రం పద్దతి కానప్పటికీ.. ఇద్దరి మధ్య అంగీకారంతోనే ఈ వివాహం జరిగినట్లు తెలుస్తుంది. కాగా, ఇలాంటి చిత్ర విచిత్రమైన పెళ్లిళ్లు గతంలో కూడా జరిగినట్లు పలు వార్త కథనాల్లో వచ్చాయి. ఇక, ఇదే హర్యానాకు చెందిన 27 ఏళ్ల ప్రవీణ్ ఫేస్‌బుక్‌లో పరిచయమైన 65 ఏళ్ల అమెరికన్ మహిళను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. తన ప్రేమికుడి కోసం అమెరికన్ మహిళ భారత్‌కు వచ్చి ఆ యువకుడిని పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే, ఇలాంటి వివాహాలను కొంతమంది తప్పుగా చూసినా, మరికొంతమంది ప్రేమకు వయస్సు అడ్డుకాదని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచం గ్లోబలైజ్ అవుతోంది, ఇలాంటి సంబంధాలు ఇకపై తరచుగా చూస్తామని సోషల్ మీడియాలో నెటిజన్స్ రాసుకొస్తున్నారు.

Exit mobile version