NTV Telugu Site icon

జైకొవ్ డి ఎప్ప‌టి నుంచి అందుబాటులోకి అంటే…

ప్ర‌పంచంలో తొలి డిఎన్ఏ ఆధారిత క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్న‌ది.  గుజ‌రాత్ కేంద్రంగా జైడ‌స్ క్యాడిలా ఫార్మా సంస్థ ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది.  ఇప్ప‌టికే  డీసీజీఐ అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.  అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తులు మంజూరు చేయ‌డంతో జైడ‌స్ క్యాడిలా జైకొవ్ డి వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి చేస్తున్న‌ది.  ఈనెల 20 వ తేదీ నుంచి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్న‌ది.  మూడు డోసుల వ్యాక్సిన్ కావ‌డం విశేషం.  అయితే, ఈ వ్యాక్సిన్‌కు సిరంజితో అవ‌స‌రం ఉండ‌ద‌ని ప్రాధ‌మికంగా తెలుస్తున్న‌ది.  నెల‌కు కోటి వ్యాక్సిన్లు ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ట్టు ఫార్మా సంస్థ తెలియ‌జేసింది.  25 శాతం టీకాల‌ను ప్రైవేట్ ఆసుప‌త్రుల‌కు విక్ర‌యించుకునే అవ‌కాశం ఉంటుంది.  అయితే, దీని ధ‌రను ఫార్మా సంస్థ ప్ర‌క‌టించాల్సి ఉన్న‌ది.  

Read: ఇవాళ బెజ‌వాడ దుర్గ‌మ్మ ఆల‌యానికి సీఎం జ‌గ‌న్‌…