న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు. పాదయాత్రలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. తిరుపతిలో ఈరోజు అమరావతి రైతు మహాసభ జరిగింది. ఈ సభకు ప్రతిపక్షాలు హాజరయ్యాయి. కాగా, అమరావతి సభపై వైపీసీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. క్యాపిటల్ కోసం జరిగిన కాదని, క్యాపిటలిస్టు కోసం జరిగిన పాదయాత్ర అని అమర్నాథ్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర రాయలసీమపై దండయాత్ర చేసినట్లు పాదయాత్ర చేశారని, విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటే చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు.
Read: మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం… అది రైతుల ఉద్యమం కాదు…
బీజేపీ నేతలు స్కాం అని చెప్పి ఎలా అమరావతి సభకు హాజరయ్యారని ప్రశ్నించారు. కమ్యునిస్టు పార్టీలు కూడా క్యాపిటలిస్టు పార్టీలకు ఎలా మద్దతు పలుకుతారని అన్నారు. త్వరలోనే మూడు రాజధానుల బిల్లులు ప్రవేశపెడతామని అన్నారు. తిరుపతిలో జరిగిన సభ పనికిమాలిన సభ అని ఆయన ఎద్దేవా చేశారు. విశాఖపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారని అన్నారు. అటు పవన్‌పై కూడా అమర్నాథ్ రెడ్డి విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ బుద్ది లేకుండా స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, రాజకీయ సిద్దాంతం లేని వ్యక్తి పవన్ అని తెలిపారు.
